మూవీ బజ్: లక్కీ కంగనా... | Kangana Ranaut offered an Italian film | Sakshi
Sakshi News home page

మూవీ బజ్: లక్కీ కంగనా...

Aug 1 2014 12:59 AM | Updated on Jul 11 2019 5:12 PM

మూవీ బజ్:  లక్కీ కంగనా... - Sakshi

మూవీ బజ్: లక్కీ కంగనా...

బాలీవుడ్ భామ కంగనారనౌత్‌కు లక్ కలిసొచ్చినట్లే ఉంది. ఇర్ఫాన్‌ఖాన్ సరసన ఫ్రెంచి సినిమాకు సైన్ చేసిన కొద్దిరోజులకే, ఆమెకు ఇటలీ నుంచీ ఆఫర్ వచ్చింది.

బాలీవుడ్ భామ కంగనారనౌత్‌కు లక్ కలిసొచ్చినట్లే ఉంది. ఇర్ఫాన్‌ఖాన్ సరసన ఫ్రెంచి సినిమాకు సైన్ చేసిన కొద్దిరోజులకే, ఆమెకు ఇటలీ నుంచీ ఆఫర్ వచ్చింది. ఇటలీ దర్శకుడు ఎడ్వర్డో డీ ఏంజెలిస్ ఆమెకు తన చిత్రంలో కీలక పాత్రను ఆఫర్ చేశాడు. ఇటలీ స్టార్ మాసిమిలానోగాలో సరసన నటించే అవకాశంపై కంగనా ఇంకా తన నిర్ణయాన్ని ప్రకటించలేదు.
 
 ఫక్రీ డ్యాన్స్...
తెలుగు సినిమా ‘జులాయి’కి రీమేక్‌గా రూపొందుతున్న తమిళ సినిమా ‘సాహసం’లో బాలీవుడ్ భామ నర్గీస్ ఫక్రీ ఐటం సాంగ్ కోసం డ్యాన్స్ చేయనుంది. ఈ పాట షూటింగ్ కోసం ఆమె హంగేరీలో షూటింగ్ ముగించుకున్న వెంటనే నేరుగా చెన్నై చేరుకుంది. ప్రశాంత్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం కోసం వంద మంది డ్యాన్సర్లతో ఈ ఐటం సాంగ్ చిత్రీకరణ జరుగుతోంది.  
 
 కృతి చాన్స్...
 ‘హీరోపంతి’ చిత్రంతో టైగర్ షరాఫ్ సరసన బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన కృతిసనాన్‌కు తాజాగా మరో చాన్స్ దొరికింది. సిద్ధార్థ మల్హోత్రా హీరోగా విక్రమాదిత్య మోత్వానీ రూపొందించనున్న చిత్రంలో కృతి హీరోయిన్‌గా అవకాశం దక్కించుకుంది.  కృతి చేతిలో ఉన్న సినిమాలు పూర్తవగానే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం అవుతుందని మోత్వానీ సన్నిహితులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement