షూటింగ్‌ పూర్తి చేసుకున్న ‘మణికర్ణిక’

Kangana Ranaut Manikarnika Shooting Completed - Sakshi

ఆంగ్లేయులను ఎదిరించి పోరాడిన వీర వనిత ఝాన్సీ లక్ష్మీ బాయ్‌ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా మణికర్ణిక. కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు టాలీవుడ్ దర్శకుడు క్రిష్ దర్శకత్వం వహించారు. అయితే క్రిష్‌.. యన్‌.టి.ఆర్‌ షూటింగ్‌లో బిజీ కావటంతో మణికర్ణిక చిత్రానికి కంగనా దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు.

ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఆఖరి పాట చిత్రీకరణ మధ్యప్రదేశ్‌లోని మహేశ్వర్ నర్మద ఘాట్‌లో జరుగుతోం‍ది. ఈ దీంతో సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయినట్టే. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసి జనవరి 25న సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top