‘ఆమె’ రీమేక్‌ చేస్తారా? | Kangana Ranaut in Hindi remake of Aadai | Sakshi
Sakshi News home page

‘ఆమె’ రీమేక్‌ చేస్తారా?

Oct 22 2019 4:18 AM | Updated on Oct 22 2019 4:18 AM

Kangana Ranaut in Hindi remake of Aadai - Sakshi

కంగనా రనౌత్‌

అమలాపాల్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన తమిళ చిత్రం ‘ఆడై’. తెలుగులో ‘ఆమె’గా విడుదలైంది. ఈ సినిమాలో నగ్నంగా నటించి అమలాపాల్‌ సంచలనం సృష్టించారు. రత్నకుమార్‌ ఈ సినిమాకు దర్శకుడు. తమిళంలో విమర్శకుల ప్రసంశలు పొందింది ఈ సినిమా. ఈ సినిమా ఇప్పుడు హిందీలో రీమేక్‌ కాబోతోందని సమాచారం. ఒరిజినల్‌ను రూపొందించిన రత్నకుమారే హిందీ రీమేక్‌ను డైరెక్ట్‌ చేయనున్నారట. హిందీ రీమేక్‌లో హీరోయిన్‌గా నటించేవారిలో కంగనా రనౌత్‌ పేరు ముందు వరుసలో వినిపిస్తోంది. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement