రెండు నెలల్లో 20 కిలోల బరువు తగ్గాలా!

Kangana Ranaut Gain 20 Kgs For Thalaivi And She Will Lose In 2 Months - Sakshi

బాలీవుడ్‌ క్వీన్‌ కంగన రనౌత్‌ ప్రతిష్టాత్మక చిత్రం ‘తలైవి’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. నటీ, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత నిజ జీవితంగా ఆధారం రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్‌ చివర దశకు చేరుకుంది. కాగా ‘తలైవి’ కోసం కంగనా 20 కిలోల బరువు పెరిగారు. ఇక ‘తలైవి’లో తన షూటింగ్‌ను పూర్తి చేసుకున్న కంగనా.. తన తదుపరి చిత్రాల కోసం బరువు తగ్గె పనిలో పడ్డారని ఆమె సోదరి రంగోలి చందేల్‌ తెలిపారు. ఈ విషయాన్ని రంగోలి తన ట్విటర్‌లో షేర్‌ చేస్తూ.. ‘ఇక తలైవి షూటింగ్‌ను దాదాపుగా పూర్తి చేసుకుంది. ఇది  చిత్ర బృందానికి సంతోషంచే విషయం. కానీ.. ఆ తర్వాత కంగనాకు  పెద్ద సవాలు ముందుంది. కంగనా తన తదుపరి చిత్రాలు ‘తేజాస్‌’, ‘ధాకడ్‌’  కోసం రెండు నెలల్లో 20 కిలోల బరువు తగ్గాల్సి ఉంది’ అని ట్విట్‌ చేశారు. అంతేగాక సినిమా షూటింగ్‌లోని కంగనా నీలి రంగు చీరలో మెరిసిన ఫొటోతో పాటు అదే నీలి రంగు చీరలో ఉన్న అప్పటీ జయలలితా ఫొటోలు గతంలోని కంగనా గ్లామరస్‌ ఫొటోలను కూడా ఆమె షేర్‌ చేశారు. (చదవండి: ఎందరికో స్ఫూర్తి)

ఎయిర్‌ఫోర్స్‌ పైలట్‌గా కంగనా.. ఫస్ట్‌ లుక్‌

కాగా ‘తలైవి’లో బొద్దుగా కనిపించడం కోసం కంగనాను బరువు పెరగాలని దర్శకుడు సూచించడంతో ఆమె జిమ్‌ మానేసి కోవ్వు పదార్థాలను ఎక్కువగ లాగించేశారు. దీంతో జీమ్‌కు, వర్కఔట్లకు బ్రేక్‌ ఇచ్చిన కంగనా తన షూటింగ్‌ పూర్తికావడంతో మళ్లీ కసరత్తులు మొదలు పెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోను తాజాగా కంగనా తన ఇన్‌స్టాగ్రామ్‌లో​ షేర్‌ చేశారు. కాగా  52 కిలోల బరువు ఉండే ఈ భామ ‘తలైవి’ కోసం 20 కిలోల బరువు పెరిగారు. కాగా ‘మణికర్ణిక’, ‘బాహుబలి’ రచయిత కేవీ విజయేంద్ర ప్రసాద్‌, ‘డర్టీ పిక్చర్‌’, ‘వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై’ చిత్రాల రచయిత రజత్‌ అరోరాలు సంయుక్తంగా ‘తలైవీ’ కథను రచించారు. కాగా  షూటింగ్‌లో చివరి దశకు చేరుకున్న ఈ సినిమా జూన్‌ 26న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top