అక్కకి ప్రేమతో... | Kangana Ranaut Has Turned Interior Designer For Rangoli | Sakshi
Sakshi News home page

అక్కకి ప్రేమతో...

Jun 2 2020 4:01 AM | Updated on Jun 2 2020 4:01 AM

Kangana Ranaut Has Turned Interior Designer For Rangoli - Sakshi

తన అక్క రంగోలి కోసం ఇంటీరియర్‌ డిజైనర్‌ అవతారం ఎత్తారు కంగనా రనౌత్‌. కంగనా డిజైన్‌ చేసిన వాటిని షేర్‌ చేశారు రంగోలి. ‘‘నీ ఇంట్లో నీకు ఎలాంటి ఇంటీరియర్‌ డిజైన్స్‌ కావాలని నన్ను కంగనా అడిగింది. నిజానికి నాకేం కావాలో నాకే తెలియదు. పాతకాలానికి చెందినవి, రొటీన్‌గా ఉండేవి మాత్రం వద్దని చెప్పాను. తను నా ఇంటిని బాగా అలంకరించింది. అది చూసి షాక్‌ అయ్యాను. నిజానికి ఇంటీరియర్‌ డిజైనింగ్‌ కంగనాకు కొత్త. కానీ తను నా కోసం ఇంటీరియర్‌ డిజైనింగ్‌ గురించి తెలుసుకుని నా ఇంటిని అందంగా తయారు చేసింది.

అందుకే ఇప్పుడు నా ఇల్లు నాకో స్వర్గంలా అనిపిస్తోంది’’ అని చెప్పుకొచ్చారు రంగోలి. ఈ లాక్‌డౌన్‌ సమయంలో కంగనా వంటలు నేర్చుకున్నారు, కవితలు రాశారు. పెయింటింగ్స్‌ వేశారు. తాజాగా ఇంటీరియర్‌ డిజైనర్‌గా మారారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. కంగనా తాజా చిత్రం ‘తలైవి’ (తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, నటి జయలలిత బయోపిక్‌) షూటింగ్‌ లాక్‌డౌన్‌ వల్ల ఆగి పోయింది. ఇంకా ఆమె అంగీకరించిన హిందీ చిత్రాల్లో ‘తేజస్, థాకడ్‌’ కూడా ఉన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement