ఎందరికో స్ఫూర్తి | Sakshi
Sakshi News home page

ఎందరికో స్ఫూర్తి

Published Mon, Feb 24 2020 5:23 AM

Kangana Ranaut new look Release from Thalaivi - Sakshi

నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా ‘తలైవి’ అనే చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఏఎల్‌ విజయ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో జయలలిత పాత్రలో నటిస్తున్నారు బాలీవుడ్‌ ‘క్వీన్‌’ కంగనా రనౌత్‌. విష్ణువర్ధన్‌ ఇందూరి, శైలేష్‌ ఆర్‌.సింగ్‌ నిర్మిస్తున్నారు. సోమవారం (ఫిబ్రవరి 24) జయలలిత 72వ జయంతి. ఈ సందర్భంగా ఈ సినిమాలోని కంగన కొత్త లుక్‌ను విడుదల చేశారు. ‘‘జయ లలితగారు ఎందరికో స్ఫూర్తి. వెండితెరపై ఆమె పాత్రను ఎంతో అంకితభావంతో పోషిస్తూ, ఆ పాత్రకు జీవాన్నిస్తున్నారు కంగనా. ఈ ప్రాజెక్ట్‌లో ఆమె భాగం కావడం ఈ సినిమా క్వాలీటిని ఎన్నో రెట్లు పెంచింది’’ అన్నారు విజయ్‌. ‘‘ఎన్నో అడ్డంకులతో పోరాడి, వాటిని అధిగమించి, ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన ఓ స్త్రీ గాథ ఈ చిత్రం’’ అన్నారు విష్ణువర్ధన్‌. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతోంది ఈ చిత్రం.

Advertisement
 
Advertisement
 
Advertisement