రెండోసారి ప్రేమ, పెళ్లి వద్దనుకున్నా..కానీ.. | Kamya Punjabi Going Tie Not With Her Boyfriend | Sakshi
Sakshi News home page

త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్న నటి!

Sep 12 2019 8:35 PM | Updated on Sep 12 2019 8:42 PM

Kamya Punjabi Going Tie Not With Her Boyfriend - Sakshi

ముంబై : హిందీ టెలివిజన్‌ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సీనియర్‌ నటి కామ్యా పంజాబీ(40) తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలిపారు. వైద్య రంగానికి చెందిన వ్యక్తితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారిందని..త్వరలోనే తామిద్దరం వివాహ బంధంతో ఒక్కటి కానున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం వరుస సీరియళ్లతో బిజీగా ఉన్న కామ్యా గురువారం బాంబై టైమ్స్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...‘అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నన్ను షలభ్‌ దాంగ్‌ను సంప్రదించాల్సిందిగా నా స్నేహితురాలు సూచించింది. అలా గత ఫిబ్రవరిలో అతడిని కలిసే అవకాశం వచ్చింది. ఇద్దరం మంచి స్నేహితులం అయ్యాము. నెలన్నర పాటు చాటింగ్‌ చేసిన తర్వాత తను నాకు ప్రపోజ్‌ చేశాడు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. వచ్చే ఏడాది ఈ సమయానికి పెళ్లైన మహిళగా మీ ముందుకు వస్తాను’ అని చెప్పుకొచ్చారు.

కాగా కామ్యా గతంలో బంటీ నేగీ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్నారు. పదేళ్ల తర్వాత 2013లో వాళ్లిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఈ విషయం గురించి కామ్యా చెబుతూ..‘గతంలో నా వైవాహిక బంధం విచ్చిన్నమైంది. అప్పుడు గుండె పగిలేలా ఏడ్చాను. అందుకే రెండోసారి ప్రేమ, పెళ్లి అనే విషయం వచ్చినపుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించాను. అయితే షలభ్‌ ఆలోచనా విధానం నన్ను చేదు అనుభవాల నుంచి బయటపడేలా చేసింది’ అని పేర్కొన్నారు. ఇక పలు సీరియల్స్‌లో కీలక పాత్ర పోషిస్తున్న కామ్యా.. హిందీ బిగ్‌బాస్‌ సీజన్‌ 7లో కూడా పాల్గొని కావాల్సినంత ప్రచారం పొందారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement