కమీనా ఏం చేశాడు? | Kameena movie is remake of Jani Gaddar | Sakshi
Sakshi News home page

కమీనా ఏం చేశాడు?

Sep 7 2013 12:25 AM | Updated on Sep 1 2017 10:30 PM

కమీనా ఏం చేశాడు?

కమీనా ఏం చేశాడు?

అయిదుగురు మిత్రులు అయిదు కోట్ల రూపాయల డీల్‌ను హ్యాండిల్ చేస్తారు. అందులో ఒకడికి కమీనా బుద్ధి పుట్టి ఏం చేశాడనే కథతో రూపొందిన చిత్రం ‘కమీనా’. హిందీలో ఘనవిజయం సాధించిన ‘జానీ గద్దర్’ ఆధారంగా తెలుగులో రూపొందిన చిత్రం ఇది.

అయిదుగురు మిత్రులు అయిదు కోట్ల రూపాయల డీల్‌ను హ్యాండిల్ చేస్తారు. అందులో ఒకడికి కమీనా బుద్ధి పుట్టి ఏం చేశాడనే కథతో రూపొందిన చిత్రం ‘కమీనా’. హిందీలో ఘనవిజయం సాధించిన ‘జానీ గద్దర్’ ఆధారంగా తెలుగులో రూపొందిన చిత్రం ఇది. లక్ష్మీకాంత్ చెన్నా దర్శకుడు. క్రిషి, లేఖా వాషింగ్టన్, సాయికుమార్, రోజా, బ్రహ్మాజీ ముఖ్యతారలు. 
 
 విజయశారదారెడ్డి అలిమండ సమర్పణలో కుబేరా సినిమాస్ పతాకంపై వరప్రసాద్‌రెడ్డి అరిమండ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 13న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ‘‘వినోదం, వాణిజ్య అంశాలు మిళితమైన క్రైమ్ కథ ఇది’’ అని దర్శకుడు  చెప్పారు. ఇందులో హీరోగా నటించిన క్రిషి మాట్లాడుతూ -‘‘సినిమా చాలా బాగా వచ్చింది.
 
 అగస్త్య పాటలు, నేపథ్య సంగీతం మెయిన్ హైలైట్. దర్శకుడు చాలా గ్రిప్పింగ్‌గా, స్టయిలిష్‌గా సినిమాను తెరకెక్కించారు. క్లాస్‌నీ మాస్‌నీ ఆకట్టుకునే అంశాలు పుష్కలంగా ఉన్నాయి’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: అగస్త్య, కెమెరా: జవహర్‌రెడ్డి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement