సరికొత్త కాంబినేషన్‌? | Kamal Hassan to produce Rajinikanths next Film | Sakshi
Sakshi News home page

సరికొత్త కాంబినేషన్‌?

Jan 25 2020 12:29 AM | Updated on Jan 25 2020 12:29 AM

Kamal Hassan to produce Rajinikanths next Film - Sakshi

రజనీకాంత్, కమల్‌హాసన్‌

అగ్ర కథానాయకులు రజనీకాంత్, కమల్‌హాసన్‌ కలిసి ఓ సినిమా చేయబో తున్నారా? అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్‌ వర్గాలు. కానీ వీరిద్దరూ హీరోలుగా నటించడం లేదు. రజనీకాంత్‌ హీరోగా కమల్‌హాసన్‌ నిర్మాతగా రాజ్‌కమల్‌ ఫిలింస్‌ ఇంటర్‌నేషనల్‌ పతాకంపై ఓ సినిమా తెరకెక్కనుందని కోలీవుడ్‌ తాజా టాక్‌. ఈ వార్త నిజమైతే ఓ కొత్త కాంబినేషన్‌ కుదిరినట్లే. ‘మా నగరం, ఖైదీ’ వంటి సినిమాలతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న లోకేష్‌ కనగరాజన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారట.

ఇదిలా ఉంటే.. కెరీర్‌ ఆరంభంలో రజనీ–కమల్‌ కలిసి పలు సినిమాల్లో నటించారు. మరి ఇప్పుడు ఎందుకు చేయడంలేదు? అనే ప్రశ్న ఈ హీరోల ముందుంచితే– ‘‘ఇప్పుడు మా కాంబినేషన్‌ అంటే బడ్జెట్‌ భారీగా ఉండాలి. దానికంటే ముఖ్యం కథ. అప్పట్లో మా ఇద్దరి ఇమేజ్‌ వేరు. ఇప్పుడు ఇమేజ్‌ వేరు. ఇద్దరి ఇమేజ్‌కి తగ్గ కథ కుదరాలి. అందుకని కలిసి నటించడానికి కుదరకపోవచ్చేమో’’ అని చెబుతుంటారు. మరి.. హీరో–నిర్మాతగా ఈ కాంబినేషన్‌ సెట్‌ అవుతుందా? అంటే వేచి చూడాల్సిందే.  

Advertisement
 
Advertisement
Advertisement