వెయిట్‌ ఈజ్‌ ఓవర్‌! | Kamal hasan ready for the movie sebashnaidu | Sakshi
Sakshi News home page

వెయిట్‌ ఈజ్‌ ఓవర్‌!

Jan 2 2017 11:20 PM | Updated on Sep 5 2017 12:12 AM

వెయిట్‌ ఈజ్‌ ఓవర్‌!

వెయిట్‌ ఈజ్‌ ఓవర్‌!

వెయిట్‌ అంటే బరువు అనుకునేరు! కాదండీ... ఎదురు చూపులు. లోక నాయకుడు కమల్‌హాసన్‌ కాలికి గాయం కావడంతో కొన్ని నెలలుగా విశ్రాంతి తీసుకుంటున్న సంగతి తెలిసిందే.

వెయిట్‌ అంటే బరువు అనుకునేరు! కాదండీ... ఎదురు చూపులు. లోక నాయకుడు కమల్‌హాసన్‌ కాలికి గాయం కావడంతో కొన్ని నెలలుగా విశ్రాంతి తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఆయన ఎప్పుడు కోలుకుంటారో, ఎప్పుడు షూటింగులకు హాజరవుతారోనని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఆ ఎదురు చూపులకు తెర పడింది. ఇప్పుడు మేకప్‌ వేసుకోవడానికి కమల్‌ రెడీ! గాయం కారణంగా బ్రేక్‌ పడిన ‘శభాష్‌ నాయుడు’ సినిమాని సెట్స్‌పైకి తీసుకు రావడానికి కమల్‌ రెడీ అవుతున్నారు. ఆయన హీరోగా నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రుతీహాసన్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement