‘బాహుబలి’ రికార్డును బద్దలు కొట్టిన ‘విశ్వరూపం2’ | Kamal Haasan Vishwaroopam 2 First Day Collections In Chennai | Sakshi
Sakshi News home page

Aug 11 2018 3:00 PM | Updated on Oct 5 2018 9:08 PM

Kamal Haasan Vishwaroopam 2 First Day Collections In Chennai - Sakshi

డివైడ్‌ టాక్‌ను తెచ్చుకున్నప్పటికీ చెన్నైలో మంచి ఓపెనింగ్స్‌...

లోక నాయకుడు, యూనివర్సల్‌ హీరో కమల్‌ హాసన్‌ స్వీయ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన సినిమా విశ్వరూపం2. విశ్వరూపం సినిమా ఘన విజయం సాధించడంతో ఈ సినిమాకు సీక్వెల్‌ వస్తుందని ఎప్పుడో ప్రకటించినా.. కొన్ని కారణాల వల్ల ఆలస్యమవుతూ చివరకు విడుదలైంది. 

ఎన్నో అంచనాల నడుమ ఆగస్టు 10న విడుదలైన విశ్వరూపం2 డివైడ్‌ టాక్‌ను తెచ్చుకుంది. మొదటి పార్ట్‌ మెప్పించినంతగా విశ్వరూపం2 మెప్పించలేకపోయిందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అయినా చెన్నైలో మాత్రం మొదటి రోజు ఓపెనింగ్స్‌ అదిరిపోయాయి. అంతేకాకుండా చెన్నైలో బాహుబలి2 (92 లక్షలు) ఫస్ట్‌ డే  రికార్డును బద్దలు కొట్టింది. చెన్నై నగరంలో మొదటి రోజు ఈ చిత్రం దాదాపు 93 లక్షలు వసూలు చేసినట్లు సమాచారం. చెన్నైలో ఫస్ట్‌ డే కలెక్షన్స్‌లో విశ్వరూపం2 ఆరో స్థానంలో ఉంది. కాలా, వివేగం, కబాలి, తేరి లాంటి సినిమాల తరువాత విశ్వరూపం2 ఉంది. 

Advertisement
 
Advertisement
Advertisement