ఆ భారీ చిత్రం తెరపైకి రానట్టేనా..? | Kamal Haasan on Marudhanayagam | Sakshi
Sakshi News home page

ఆ భారీ చిత్రం తెరపైకి రానట్టేనా..?

Jun 29 2017 10:32 AM | Updated on Sep 5 2017 2:46 PM

ఆ భారీ చిత్రం తెరపైకి రానట్టేనా..?

ఆ భారీ చిత్రం తెరపైకి రానట్టేనా..?

లోక నాయకుడు కమల్ హాసన్ చాలా ఏళ్ల క్రితమే బాహుబలిని మించిన ఫాంటసీ సినిమాను మొదలు పెట్టాడు. బ్రిటన్ రాణి

లోక నాయకుడు కమల్ హాసన్ చాలా ఏళ్ల క్రితమే బాహుబలిని మించిన ఫాంటసీ సినిమాను మొదలు పెట్టాడు. బ్రిటన్ రాణి ఎలిజబెత్ చేతుల మీదుగా ప్రారంభించిన మరుదనాయగం సినిమా ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆగిపోయింది. ఆ తరువాత చాలా సందర్భాల్లో సినిమాను తిరిగి ప్రారంభించే ఆలోచన ఉన్నట్టుగా చెప్పిన కమల్ ఇప్పుడు ఆ ఆశలు కూడా వదులు కున్నట్టున్నాడు.

ఇటీవల ఓ మీడియా ప్రతినిథి మరుదనాయగం సినిమా ఎప్పుడు తెర మీదకు వస్తుందన్న ప్రశ్నకు సమాధానంగా.. ఏమో సినిమాగానే కాదు.. వెబ్ సీరీస్, టీవీ సీరీస్లా అయినా రావచ్చు అంటూ సమాధానమిచ్చాడు. అంటే ఇక మరుదనాయగంను వెండితెర మీదకు తీసుకురావటం అసాధ్యమని కమల్ కూడా భావిస్తున్నట్టున్నాడు. అంతేకాదు ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న శభాష్ నాయుడు, విశ్వరూపం 2 సినిమాల పరిస్థితి కూడా ఇలాగే ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement