న్యూ లుక్‌లో కమల్‌ హాసన్‌ | Kamal Haasan Clean Shaven Avatar For Indian 2 | Sakshi
Sakshi News home page

న్యూ లుక్‌లో కమల్‌ హాసన్‌

Aug 6 2019 2:38 PM | Updated on Aug 8 2019 11:13 AM

Kamal Haasan Clean Shaven Avatar For Indian 2 - Sakshi

పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి లోక నాయకుడు కమల్‌ హాసన్‌ ఒకే లుక్‌లో దర్శనమిస్తున్నాడు. మెలితిప్పిన మీసంతో రాయల్ లుక్‌లో ఆకట్టుకుంటున్నాడు. టీవీ షోస్‌తో పాటు సినీ కార్యక్రమాల్లో కూడా అదే లుక్‌లో కనిపించాడు కమల్‌. అయితే తాజాగా కమల్‌ మీసం తీసేసి క్లీన్‌ షేవ్‌లో కనిపించాడు.

కైలాష్‌ సత్యర్థి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన డాక్యుమెంటరీ ప్రదర్శనకు కమల్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ కార్యక్రమంలోనే న్యూ లుక్‌ను రివీల్‌ చేశాడు కమల్‌. ప్రస్తుతం శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇండియన్‌ 2 సినిమాలో నటిస్తున్న కమల్‌, ఆ సినిమాలోని భారతీయుడు పాత్ర కోసమే క్లీన్‌ షేవ్‌లోకి మారినట్టుగా తెలుస్తోంది. లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాలో సిద్ధార్థ్‌, ప్రియా భవానీ శంకర్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement