మాస్ పటాస్ | Kalyanram's Pataas ready for a December splash | Sakshi
Sakshi News home page

మాస్ పటాస్

Nov 29 2014 1:06 AM | Updated on Sep 2 2017 5:17 PM

మాస్ పటాస్

మాస్ పటాస్

నచ్చిన కథలతో సినిమాలు తీస్తూ, నచ్చిన పాత్రల్నే ఎంచుకుంటూ తన అభిరుచికి అనుగుణంగా కెరీర్‌లో ముందుకు దూసుకుపోతున్నారు నందమూరి కల్యాణ్‌రామ్.

నచ్చిన కథలతో సినిమాలు తీస్తూ, నచ్చిన పాత్రల్నే ఎంచుకుంటూ తన అభిరుచికి అనుగుణంగా కెరీర్‌లో ముందుకు దూసుకుపోతున్నారు నందమూరి కల్యాణ్‌రామ్. ఈ క్రమంలో ఆయన చేస్తున్న తాజా చిత్రం ‘పటాస్’. అనిల్ రావిపూడి దర్శకుడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్‌లో ఉంది. ఈ చిత్రం టైటిల్ లోగోను, టీజర్‌ను శుక్రవారం విడుదల చేశారు. సాయికార్తీక్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను డిసెంబర్ 7న విడుదల చేయనున్నట్లు కల్యాణ్‌రామ్ తెలిపారు.

మాస్ మెచ్చే కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా అనిల్ ఈ చిత్రాన్ని రూపొందించారనీ, ఇప్పటివరకూ చేయని భిన్నమైన పాత్రను ఇందులో చేశాననీ కల్యాణ్‌రామ్ అన్నారు. డిసెంబర్‌లోనే సినిమాను విడుదల చేస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. శ్రుతీ సోధీ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో బ్రహ్మానందం, సాయికుమార్, ఎమ్మెస్ నారాయణ, జయప్రకాశ్‌రెడ్డి, పోసాని కృష్ణమురళి, ఆశుతోష్ రాణా, శ్రీనివాసరెడ్డి ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: సర్వేష్ మురారి, నిర్మాణం: నందమూరి తారక రామారావు ఆర్ట్స్.
 

Advertisement
 
Advertisement
Advertisement