శర్వా సినిమాలో పల్లెటూరి అమ్మాయిగా..! | Kalyani Priyadarshan Sports Desi Look In Sharwanad Film | Sakshi
Sakshi News home page

Apr 19 2018 12:15 PM | Updated on Apr 19 2018 3:24 PM

Kalyani Priyadarshan Sports Desi Look In Sharwanad Film - Sakshi

హాలో సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన అందాల భామ కల్యాణి ప్రియదర్శన్‌. తొలి సినిమాతోనే నటిగా మంచి మార్కులు సాధించిన కల్యాణి ప్రస్తుతం శర్వానంద్‌ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తోంది. స్వామి రారా ఫేం సుధీర్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కుతుందన్న ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో శర్వానంద్‌ 80ల కాలం నాటి డాన్‌ పాత్రలో కనిపించనున్నాడట.

కల్యాణి కూడా ఆ కాలం నాటి పల్లెటూరి అమ్మాయి పాత్రలో కనిపించనుంది. తొలి సినిమాలో ట్రెండీగా కనిపించిన ఈ భామ ఇప్పుడు పల్లె పడుచులా కనిపించేందుకు చాలా హోం వర్క్‌ చేసినట్టుగా తెలుస్తోంది. స్టైలిస్ట్‌ అశ్విన్‌, దర్శకుడు సుధీర్‌ వర్మలు కళ్యాణీని పూర్తిగా పల్లెటూరి అమ్మాయిగా మార్చేశారు. ఇప్పటికే విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో ఒక షెడ్యూల్‌ షూటింగ్‌ పూర్తి కాగా, మరో షెడ్యూల్‌ను త్వరలో హైదరాబాద్‌లో ప్రారంభించనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement