118... ఓ సస్పెన్స్‌

Kalyan Ram's '118' to release on March 1 - Sakshi

కల్యాణ్‌ రామ్‌ హీరోగా కేవీ గుహన్‌ దర్శకత్వంలో రూపొందించిన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘118’. నివేథా థామస్, షాలినీ పాండే కథానాయికలు. మహేశ్‌ కోనేరు నిర్మించిన ఈ సినిమాను మార్చి 1న రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మహేశ్‌ కోనేరు మాట్లాడుతూ – ‘‘కల్యాణ్‌రామ్‌   ఇప్పటి వరకూ చేయని జానర్‌ ఇది.

సీట్‌ ఎడ్జ్‌ థ్రిల్లర్‌ తరహా సస్పెన్స్‌ ఉంటుంది. యాక్షన్‌ పార్ట్‌ సినిమాకు హైలైట్‌. ఇప్పటికే రిలీజ్‌ చేసిన ఫస్ట్‌ లుక్, టీజర్స్‌కు మంచి స్పందన లభిస్తోంది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: శేఖర్‌ చంద్ర, మాటలు : ‘మిర్చి’ కిరణ్‌. కథ, కెమెరా, స్క్రీన్‌ప్లే : కె.వి గుహన్‌.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top