స్టైలిష్‌ యాక్షన్‌ | Kalyan Ram 118 Movie Title Logo | Sakshi
Sakshi News home page

స్టైలిష్‌ యాక్షన్‌

Dec 4 2018 12:16 AM | Updated on Dec 4 2018 12:16 AM

Kalyan Ram 118 Movie Title Logo - Sakshi

కల్యాణ్‌ రామ్‌

అటు కమర్షియల్‌ సినిమాలు.. ఇటు వైవిధ్యమైన చిత్రాలు చేస్తూ తన ప్రత్యేకత చాటుకుంటున్నారు హీరో కల్యాణ్‌ రామ్‌. తాజాగా ఆయన నటించిన చిత్రం ‘118’. నివేథా థామస్, షాలినీ పాండే కథానాయికలు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ కె.వి.గుహన్‌ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా తెలుగుకి పరిచయం అవుతున్నారు. ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై మహేశ్‌ కోనేరు నిర్మించిన ఈ సినిమా టైటిల్, ఫస్ట్‌ లుక్‌ను సోమవారం విడుదల చేశారు.

మహేశ్‌ కోనేరు మాట్లాడుతూ– ‘‘స్టైలిష్‌ యాక్షన్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రం ‘118’. కథ, కథనంతో పాటు యాక్షన్‌ పార్ట్‌కు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. కల్యాణ్‌ రామ్‌గారు ఇప్పటి వరకు చేయనటువంటి సరికొత్త పాత్రలో ప్రేక్షకులను మెప్పించనున్నారు. కె.వి.గుహన్‌గారు ఈ చిత్రంతో టాలీవుడ్‌కి డైరెక్టర్‌గా పరిచయం కావడంతో పాటు సినిమాటోగ్రఫీ కూడా చేశారు. ప్రస్తుతం మా సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. జనవరి ద్వితీయార్ధంలో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: శేఖర్‌ చంద్ర.

Advertisement
 
Advertisement
Advertisement