నిఖిల్ కాదన్న కథతో మెగా అల్లుడు..! | kalyan entry movie is nikhil's rejected story | Sakshi
Sakshi News home page

Dec 31 2017 3:05 PM | Updated on Dec 31 2017 3:05 PM

kalyan entry movie is nikhil's rejected story - Sakshi

మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో అరంగేట్రానికి రంగం సిద్ధమవుతోంది. చిరంజీవి చిన్నల్లుడు, శ్రీజ భర్త కళ్యాణ్ కనుగంటి హీరోగా పరిచయం అయ్యేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కథా చర్చలు కూడా పూర్తయ్యాయన్న టాక్ వినిపిస్తోంది. జత కలిసే సినిమా ఫేం రాకేష్ శశి కళ్యాణ్ తొలి సినిమాకు దర్శకత్వం వహించనున్నాడట.

అయితే ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర వార్త టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఈ కథ ముందుగా యంగ్ హీరో నిఖిల్ కు వినిపించారట. తండ్రి కొడుకుల మధ్య జరిగే సెంటిమెంట్ కథ కావటంతో తనకు సూట్ కాదన్న ఉద్దేశంతో నిఖిల్ రిజెక్ట్ చేశాడట. అయితే అదే కథ కళ్యాణ్ కు నచ్చటం, మెగాస్టార్ కూడా ఓకె చెప్పటంతో త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుందన్న ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాను సాయి కొర్రపాటి వారాహి చలన చిత్రం బ్యానర్ పై తెరకెక్కించనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement