రేటు పెంచేసిందట! | Kajal Aggarwal increased her Salary | Sakshi
Sakshi News home page

రేటు పెంచేసిందట!

Aug 23 2017 2:40 AM | Updated on Aug 28 2018 4:32 PM

రేటు పెంచేసిందట! - Sakshi

రేటు పెంచేసిందట!

దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న సామెతను నేటి తారలు అక్షరాలా పాటిస్తుంటారు. ఇందుకు నటి కాజల్‌ అగర్వాల్‌ అతీతం కాదు.

దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న సామెతను నేటి తారలు అక్షరాలా పాటిస్తుంటారు. ఇందుకు నటి కాజల్‌ అగర్వాల్‌ అతీతం కాదు. ఆదిలో అవకాశాల కోసం పోరాడింది. ఆ తరువాత విజయాల కోసం ఆరాటపడింది. ఇప్పుడు పారితోషికాన్ని పెంచడానికి తహ తహలాడుతోంది. 2004లో ఒక హిందీ చిత్రంలో సహ నటిగా పరిచయమైన కాజల్‌అగర్వాల్‌ను అక్కడ ఎవరూ గుర్తించలేదు.

అయితే కోలీవుడ్, టాలీవుడ్‌లో మాత్రం కథానాయకిగా అవకాశాలిచ్చి ఆహ్వానించారు. తమిళంలోకి పళని చిత్రం ద్వారా దిగుమతి అయిన కాజల్‌ ఆ తరువాత మంచి అవకాశాల కోసం చాలా ప్రయత్నాలు చేసింది. కొన్ని చిత్రాల్లో నటించినా విజయాలు ఎడారిలోని ఒయాసిసుల్లానే అనిపించాయి. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగులో తొలి చిత్రమే విజయాన్ని అందించింది. అలా అక్కడ నటిగా ఎదుగుతున్న సమయంలో మళ్లీ కోలీవుడ్‌లో కార్తీకి జంటగా నాన్‌మహాన్‌ అల్ల చిత్రంలో నటించే అవకాశం అందడంతో పాటు సక్సెస్‌ను వరించింది.

 ఆ తరువాత విజయ్‌తో తుపాకీ, జిల్లా చిత్రాలు కాజల్‌ అగర్వాల్‌ మార్కెట్‌ను పెంచాయి. దీంతో తన పారితోషికాన్ని కోటి నుంచి కోటిన్నరకు పెంచుకుంటూపోయింది. ఈ మధ్య తెలుగులో మెగాస్టార్‌ చిరంజీవితోనూ అమ్మడు లెట్స్‌ డూ కుమ్ముడు అంటూ ఇరగదీసేసింది. ఇలాంటి పరిస్థితుల్లో కాజల్‌ తెలుగులో కంటే తమిళంలో అధిక పారితోషికాన్ని డిమాండ్‌ చేస్తుందనే ప్రచారం హల్‌చల్‌ చేస్తోంది.

 తాజాగా స్టార్‌ నటులు విజయ్, అజిత్‌లతో ఏక కాలంలో భారీ చిత్రాల్లో నటించే లక్కీ చాన్సును కాజల్‌ కొట్టేసింది. అజిత్‌కు జంటగా నటిస్తున్న వివేకం చిత్రం రేపు తెరపైకి రానుండగా, విజయ్‌తో రొమాన్స్‌ చేస్తున్న మెర్శల్‌ చిత్రం దీపావళికి సందడి చేయడానికి ముస్తాబవుతోంది. ఇలా ఇద్దరు స్టార్స్‌ చిత్రాల్లో నటించిన ఖుషీలో ఉన్న కాజల్‌ అగర్వాల్‌ ఈ చిత్రాల విజయం ఖాయం అన్న నమ్మకంతో పనిలో పనిగా తన పారితోషికాన్ని కోటిన్నర నుంచి రెండు కోట్లకు పెంచేసిందనే ప్రచారం జరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement