బిజీ అవుతోన్న చందమామ | Kajal Aggarwal in demand | Sakshi
Sakshi News home page

Jan 13 2018 10:29 AM | Updated on Jan 13 2018 10:37 AM

Kajal Aggarwal in demand - Sakshi

టాలీవుడ్ అందాల భామ కాజల్ అగర్వాల్ మళ్లీ బిజీ అవుతోంది. ఒక దశలో ఇక కెరీర్ ముగిసినట్టే అనుకుంటుండగా స్టార్ హీరోల సినిమాలతో కంబ్యాక్ అయిన ఈ బ్యూటీ, ఇప్పుడు సీనియర్లతో పాటు యంగ్ హీరోలతోనూ జత కడుతూ వరుస సినిమాలతో సత్తా చాటుతోంది. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న ఎమ్మెల్యే (మంచి లక్షణాలున్న అబ్బాయి) సినిమాలో నటిస్తోంది కాజల్.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోన్న సుధీర్ వర్మ, శర్వానంద్‌ల సినిమాలోనూ కాజల్ ను హీరోయిన్‌గా ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నారట చిత్రయూనిట్. ఈ సినిమాతో పాటు తేజ దర్శకత్వంలో వెంకటేష్‌ హీరోగా తెరకెక్కబోయే సినిమాలోనూ కాజల్ నే హీరోయిన్ గా ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నారు. వీటితో పాటు తమిళంలోనూ పలు చిత్రాలకు ఓకె చెప్పిందీ చందమామ.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement