డిష్యూం.. డిష్యూం

Kajal Agarwal starts training martial arts for Indian 2 - Sakshi

ఎంతో ఏకాగ్రతగా పుస్తకం చదవడంలో నిమగ్నమైపోయారు కథానాయిక కాజల్‌ అగర్వాల్‌. హెడ్డింగ్‌కి, పుస్తకానికి ఉన్న అనుబంధం ఏంటి? అంటే... అక్కడికే వస్తున్నాం. ఆమె చదువుతున్నది మామూలు పుస్తకం కాదు. కేరళకు చెందిన మార్షల్‌ ఆర్ట్‌ ‘కలరిపయ్యట్టు’ శిక్షణకు సంబంధించిన పుస్తకం. ‘‘కలరిపయ్యట్టు ట్రైనింగ్‌ పుస్తకం చదవడం స్టార్ట్‌ చేశాను. త్వరలో సాధన మొదలుపెడతాను’’ అని కాజల్‌ పేర్కొన్నారు. మరి... కాజల్‌ సడన్‌గా ఈ మార్షల్‌ ఆర్ట్‌ ఎందుకు నేర్చుకుంటున్నారో చెప్పలేదు కదూ. ‘ఇండియన్‌ 2’ కోసమట.

శంకర్‌ దర్శకత్వంలో కమల్‌ హాసన్‌ హీరోగా ‘ఇండియన్‌ 2’ అనే చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. ఇందులో కథానాయికగా నటిస్తారు కాజల్‌. ఆల్రెడీ మొదటి షెడ్యూల్‌కి సంబంధించిన సెట్‌ వర్క్‌ కూడా పూర్తి కావొచ్చిందట. ఈ నెలాఖరులో ఈ సినిమా షూటింగ్‌ స్టార్ట్‌ కానుందని కోలీవుడ్‌ సమాచారం. అయితే ఈ సినిమా కోసమే కాజల్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్చుకుని డిష్యూం.. డిష్యూం అంటూ వెండితెరపై విలన్స్‌ను రప్ఫాడిస్తారన్నమాట. 1996లో వచ్చిన ‘ఇండియన్‌’ (తెలుగులో ‘భారతీయుడు’) చిత్రానికి ‘ఇండియన్‌ 2’ రీమేక్‌ అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇక ఈ సినిమా కాకుండా తెలుగులో తేజ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్‌ హీరోగా రూపొందుతున్న సినిమాలో కూడా కాజల్‌ కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top