హాట్ మోడల్తో మహేష్..? | Kaira advani finalised for Mahesh babu film | Sakshi
Sakshi News home page

హాట్ మోడల్తో మహేష్..?

Apr 6 2017 1:47 PM | Updated on Sep 5 2017 8:07 AM

హాట్ మోడల్తో మహేష్..?

హాట్ మోడల్తో మహేష్..?

ప్రస్తుతం మురుగదాస్తో చేస్తున్న సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఇవ్వని మహేష్, తరువాత చేయబోయే సినిమాకు

ప్రస్తుతం మురుగదాస్తో చేస్తున్న సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఇవ్వని మహేష్, తరువాత చేయబోయే సినిమాకు మాత్రం ఏర్పాట్లు చేసేసుకుంటున్నాడు. ప్రస్తుతం చేస్తున్న సినిమా ఇప్పటికే 80 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది. జూన్ 23న తెలుగు, తమిళ్తో పాటు హిందీలోనూ ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా తరువాత కొరటాల శివ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు మహేష్.

ఈ సినిమాలో హీరోయిన్గా బాలీవుడ్ బ్యూటీని తీసుకోవాలని నిర్ణయించారు. పరిణితీ చోప్రా, దిశాపటానీ లాంటి వారి పేర్లు వినిపించినా.. ఎవరినీ ఫైనల్ చేయలేదు. తాజాగా ఓ హాట్ మోడల్ను హీరోయిన్గా కన్ఫామ్ చేశారన్న టాక్ వినిపిస్తోంది. మాగ్జిమ్ మాగ్జైన్ ఫోటో షూట్తో ఆకట్టుకున్న కైరా అద్వానీని మహేష్, కొరటాల సినిమాకు హీరోయిన్గా తీసుకునేందుకు రెడీ అవుతున్నారు.

ఫగ్లీ, ఎంఎస్ ధోని సినిమాల్లో హోమ్లీ క్యారెక్టర్స్తో ఆకట్టుకున్న కైరా, త్వరలో రిలీజ్కు రెడీ అవుతున్న మెషీన్ సినిమాలో గ్లామరస్ లుక్లో కనిపిస్తోంది. బాలీవుడ్లో స్టార్ ఇమేజ్ లేకపోయినా.. హాట్ ఫోటోషూట్స్తో మంచి పాపులారిటీ సొంతం చేసుకుంది. త్వరలోనే మహేష్, కొరటాల శివ సినిమా హీరోయిన్పై అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement