అమెరికాలో కబాలి తొలి షో | Kabali to release in 400 screens in the america | Sakshi
Sakshi News home page

ఇండియాలో కంటే ముందుగా యూఎస్ లో తొలి షో

Jul 16 2016 11:13 AM | Updated on Sep 12 2019 10:40 AM

అమెరికాలో కబాలి తొలి షో - Sakshi

అమెరికాలో కబాలి తొలి షో

కబాలి చిత్ర మొదటి షో అమెరికాలో ప్రదర్శనకు సిద్ధం అవుతోంది. సూపర్‌స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం కబాలి.

కబాలి చిత్ర మొదటి షో అమెరికాలో ప్రదర్శనకు సిద్ధం అవుతోంది. సూపర్‌స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం కబాలి. యువ దర్శకుడు రంజిత్ దర్శకత్వంలో నిర్మాత కలైపులి ఎస్.థాను నిర్మించిన భారీ బడ్జెట్ చిత్రం కబాలి. ఈ చిత్రంపై అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. చిత్ర టీజర్, పాటలు ఇప్పటికే విశేష ఆదరణను పొందడంతో రజనీకాంత్ అభిమానుల్లో పండగ వాతావరణం నెలకొంది. కాగా చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 22న విడుదలకు సిద్ధం అవుతోంది.

విశేషం ఏమిటంటే ఈ చిత్రం ఇండియాలో కంటే ముందుగానే అట్లాంటిక్ మహాసముద్రాన్ని దాటి అమెరికాలో విడుదల కానుంది. అమెరికాకు ఇండియాకు మధ్య కాల వ్యవధిలో వ్యత్యాసం ఉండడంతో భారత కాలమానం ప్రకారం కబాలి చిత్రం 21న ఉదయం 11 గంటలకు అమెరికాలో తొలి షో ప్రదర్శింపబడనుంది. ఇంతకు ముందు ఏ చిత్రానికి లేని విధంగా దాదాపు 400 థియేటర్లలో కబాలి విడుదల చేస్తున్నారు. మరో విశేషం ఏమిటంటే తెలుగు, హిందీ భాషలతో పాటు మళయాలం భాషలో అనువాదం అయిన కబాలి చిత్రాన్ని ఇండోనేషియా, చైనా, థాయ్‌లాండ్, జపాన్ భాషల్లోనూ అనువదించి సెప్టెంబర్‌లో విడుదలకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోందన్నది తాజా సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement