కెరీర్పై దృష్టి పెట్టిన సూపర్ స్టార్ కూతురు | 'Kabali' producer to bankroll Soundarya Rajinikanth's next | Sakshi
Sakshi News home page

కెరీర్పై దృష్టి పెట్టిన సూపర్ స్టార్ కూతురు

Sep 27 2016 12:06 PM | Updated on Sep 4 2017 3:14 PM

కెరీర్పై దృష్టి పెట్టిన సూపర్ స్టార్ కూతురు

కెరీర్పై దృష్టి పెట్టిన సూపర్ స్టార్ కూతురు

ఇటీవల విడాకుల వార్తలతో మీడియాలో కనిపించిన సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ప్రస్తుతం కెరీర్పై దృష్టి పెడుతోంది. ఇప్పటికే కొచ్చాడయాన్ లాంటి భారీ గ్రాఫిక్స్ చిత్రానికి దర్శకత్వం వహించిన సౌందర్య, గోవా....

ఇటీవల విడాకుల వార్తలతో మీడియాలో కనిపించిన సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ప్రస్తుతం కెరీర్పై దృష్టి పెడుతోంది. ఇప్పటికే కొచ్చాడయాన్ లాంటి భారీ గ్రాఫిక్స్ చిత్రానికి దర్శకత్వం వహించిన సౌందర్య, గోవా అనే కామెడీ చిత్రాన్ని నిర్మించింది. మరోసారి అంతా కొత్త వారితో తెరకెక్కనున్న చిత్రానికి దర్శకత్వ బాధ్యతలు తీసుకుంది.

రజనీకాంత్ హీరోగా కబాలి లాంటి భారీ బ్లాక్ బస్టర్ను అందించిన ప్రముఖ నిర్మాత కలైపులి ఎస్.థాను ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులతో పాటు, నటీనటుల ఎంపిక కూడా జరుగుతున్నట్టుగా తెలిపారు. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాతో దర్శకురాలిగా సక్సెస్ సాధించాలన్న పట్టుదలతో ఉంది సౌందర్య రజనీకాంత్.

Advertisement
 
Advertisement
Advertisement