చిన్న సినిమా ఆడియో వేడుకకు కేటీఆర్,రామ్ చరణ్ | Kaadhali Auio Launch On June 3rd.. KTR, Ram Charan Chief Guests | Sakshi
Sakshi News home page

చిన్న సినిమా ఆడియో వేడుకకు కేటీఆర్,రామ్ చరణ్

Jun 1 2017 5:16 PM | Updated on Sep 5 2017 12:34 PM

చిన్న సినిమా ఆడియో వేడుకకు కేటీఆర్,రామ్ చరణ్

చిన్న సినిమా ఆడియో వేడుకకు కేటీఆర్,రామ్ చరణ్

ఆసక్తికరమైన ట్రయాంగులర్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న 'కాదలి' సినిమాపై ఇప్పటికే మంచి హైప్ క్రియేట్ అయ్యింది. రానా

ఆసక్తికరమైన ట్రయాంగులర్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న 'కాదలి' సినిమాపై ఇప్పటికే మంచి హైప్ క్రియేట్ అయ్యింది. రానా, సమంత వంటి స్టార్ లు ప్రమోట్ చేయడం వల్ల ఈ సినిమా టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారింది. ఆ క్రేజ్ను మరింత పెంచుతూ.. 'కాదలి' చిత్రం ఆడియోను జూన్ 3న సినీ రాజకీయ ప్రముఖుల సమక్షంలో విడుదల చేయనున్నారు. తెలంగాణ ఐ.టి మంత్రి కేటీయార్,మెగాపవర్ స్టార్ రామ్ చరణ్లు కాదలి ఆడియోకు ముఖ్య అతిధులుగా హజరవుతున్నారు

అనగనగా సినిమా పతాకంపై పట్టాభి ఆర్. చిలుకూరి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం డిఫెరెంట్ కాన్సెప్ట్తో రూపొందుతుంది. ఈ సందర్భంగా దర్శకనిర్మాత పట్టాభి ఆర్.చిలుకూరి మాట్లాడుతూ.. 'మా 'కాదలి' టైటిల్కు మంచి స్పందన వచ్చింది. మినిష్టర్ కేటీఆర్ గారు మా టైటిల్ లోగోను విడుదల చేసినందుకు చాలా సంతోషించాం. ఇప్పుడు ఆయన మా ఆడియో వేడుకకు కూడా రానున్నారు. కేటీఆర్ గారితోపాటు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈ వేడుకకు హాజరువుతున్నారు. మా చిన్న చిత్రానికి ఇంతటి భారీ పబ్లిసిటీ లభిస్తుండడం, స్టార్ హీరో హీరోయిన్లతోపాటు మా కేటీఆర్ గారు కూడా సపోర్ట్ చేస్తుండడం వల్ల 'కాదలి'పై మంచి హైప్ క్రియేట్ అయ్యింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్న ఈ సినిమాను జూన్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నా'మన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement