జ్యోతిక ... హౌ ఓల్డ్ ఆర్ యూ | Jyothika to return with 'How Old Are You' Tamil remake | Sakshi
Sakshi News home page

జ్యోతిక ... హౌ ఓల్డ్ ఆర్ యూ

Aug 14 2014 11:06 AM | Updated on Sep 2 2017 11:52 AM

జ్యోతిక ... హౌ ఓల్డ్ ఆర్ యూ

జ్యోతిక ... హౌ ఓల్డ్ ఆర్ యూ

ప్రముఖ నటి జ్యోతిక తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించనున్నారా అంటే అవుననే అంటున్నాయి తమిళ సినీ పరిశ్రమ వర్గాలు.

చెన్నై: ప్రముఖ నటి జ్యోతిక తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించనున్నారా అంటే అవుననే అంటున్నాయి తమిళ సినీ పరిశ్రమ వర్గాలు. మలయాళంలో సూపర్ హిట్ అయిన 'హౌ ఓల్డ్ ఆర్ యూ' చిత్రం తమిళంలో అదే పేరుతో రీమేక్ చేయనున్నారు. 'హౌ ఓల్డ్ ఆర్ యూ' చిత్ర నిర్మాణ హక్కులను జ్యోతిక భర్త, ప్రముఖ హీరో సూర్య సొంత నిర్మాణ సంస్థ  '2డీ ఎంటర్టైన్మెంట్' సొంతం చేసుకుంది.

మలయాళంలో నిర్మించిన హౌ ఓల్డ్ ఆర్ యూ చిత్రంలో మంజూ వారియర్ ముఖ్య భూమిక పోషించారు. తమిళంలో రీమేక్ అవుతున్న ఆ చిత్రంలోని మంజూ పాత్రలో జ్యోతిక ఒదిగిపోనున్నారు. మలయాళంలో ఆ చిత్రానికి దర్శకత్వం వహించిన రోషన్ అండ్రూస్ తమిళంలో నిర్మిస్తున్న చిత్రానికి కూడా దర్శకత్వ వహించనున్నారు.


హీరోహీరోయిన్ జ్యోతిక, సూర్యలు ఒకరినోకరు ప్రేమించుకున్నారు. పెద్దల అనుమతితో ఆ ఇద్దరు ఏడు అడుగులు నడిచారు. అనంతరం జ్యోతిక ఇద్దరు చిన్నారులు దివ్య, దియాలకు జన్మ నిచ్చింది. ఏడేళ్ల విరామం తర్వాత జ్యోతిక మరోసారి తెరంగేట్రం చేయనున్నారు. 2007లో మణికందా తమిళ చిత్రంలో జ్యోతిక నటించారు. ఇదే అమె చివరి చిత్రం అన్న సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement