-
సూర్యను భర్తగా పొందడం నా అదృష్టం : జ్యోతిక
‘‘నా కలలను, ఆశయాలను ప్రోత్సహించడానికి సూర్య ఏమాత్రం వెనకాడరు. ఆయన్ను భర్తగా పొందడం నా అదృష్టం. ఈ చిత్రం విషయానికొస్తే.. నా కెరీర్లో ‘ది బెస్ట్’గా నిలిచిన చిత్రాల జాబితాలో చేరుతుంది’’ అని జ్యోతిక అన్నారు. కొంత విరామం తర్వాత ఆమె నటించిన చిత్రం ‘36 వయదినిలే’. మలయాళ చిత్రం ‘హౌ ఓల్డ్ ఆర్ యు’కి ఇది రీమేక్. రోషన్ ఆండ్రూస్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని హీరో, జ్యోతిక భర్త సూర్య నిర్మించడం విశేషం. సంతోష్ నారాయణన్ స్వరపరచిన ఈ చిత్రం పాటల వేడుక చెన్నయ్‌లో జరిగింది. సూర్య మాట్లాడుతూ -‘‘నేను అభిమానులను ఎప్పుడు కలిసినా, ‘జ్యోతిక మళ్లీ ఎప్పుడు నటిస్తారు’ అని అడిగేవాళ్లు. మంచి సినిమా అయితేనే జ్యోతిక చేయాలనుకుంది. ‘36 వయదినిలే’ రైట్ మూవీ అనిపించింది’’ అన్నారు. మా వదిన జ్యోతికకు నేను పెద్ద అభిమానిని అని కార్తీ పేర్కొన్నారు. ఈ వేడుకలో సూర్య, జ్యోతికల కుమార్తె దియా, కుమారుడు దేవ్ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. సూర్య తండ్రి శివకుమార్, బాల, వసంత్, వెంకటప్రభు, పాండిరాజ్, రాధామోహన్, కె.ఇ. జ్ఞానవేల్‌రాజా తదితరులు పాల్గొన్నారు. -
36 ఏళ్ల వయసులో...
కొంత విరామం తర్వాత జ్యోతిక మళ్లీ వెండితెరపై కనిపించనున్నారు. మలయాళ చిత్రం 'హౌ ఓల్డ్ ఆర్ యు' తమిళ రీమేక్‌లో ఆమె నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఏ టైటిల్ పెడితే బాగుంటుందని చిత్రబృందం చర్చించినప్పుడు చిత్రబృందం '36 వయదినిలే' అని పెడితే బాగుంటుందని జ్యోతిక అన్నారట. అంటే.. 36 ఏళ్ల వయసులో... అని అర్థం. ఈ టైటిల్ అందరికీ నచ్చడంతో దాన్నే ఖరారు చేశారని సమాచారం. -
జ్యోతికను చూస్తే నాకు గిల్టీగా ఉంటుంది
‘‘జ్యోతిక మంచి ఇల్లాలు. భార్యగా, తల్లిగా, కోడలిగా తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తుంది. ఏ పనినైనా పక్కా ప్రణాళికతో చేస్తుంది’’ అని తన భార్యను అభినందిస్తున్నారు సూర్య. భర్త నుంచి మంచి హోమ్ మేకర్ అనే కితాబు కొట్టేసిన జ్యోతిక నటిగా కూడా బోల్డంత మంది అభిమానులను సంపాదించుకున్న విషయం తెలిసిందే. కథానాయికగా మంచి స్థాయిలో ఉన్నప్పుడే సూర్యని ప్రేమించి, పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత సినిమాలకు దూరమయ్యారు. అయితే అది ఫుల్స్టాప్ కాదు, కామా మాత్రమే. ఎందుకంటే, త్వరలో జ్యోతిక రీ-ఎంట్రీ కానున్నారు. ఇప్పటికే ఆమె ఓ చిత్రానికి పచ్చజెండా ఊపేశారు. దాదాపు ఏడెనిమిదేళ్లు సినిమాలకు దూరంగా ఉన్న జ్యోతిక ఇప్పుడు మళ్లీ నటించాలనుకోవడానికి కారణం ఏంటి? అనే ప్రశ్న సూర్య ముందుంచితే -‘‘మాకో పాప, బాబు అనే విషయం తెలిసిందే. పిల్లల సంరక్షణ కారణంగా జ్యోతిక వేరే దేని మీదా దృష్టి పెట్టలేకపోయింది. ఇప్పుడు పిల్లలు కొంచెం పెద్దవాళ్లు కావడంతో ఇక నిక్షేపంగా కెరీర్ కొనసాగించే అవకాశం లభించింది. వాస్తవానికి తను రీ-ఎంట్రీ గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. కానీ, కొంతమంది దర్శక, నిర్మాతలు ‘మీరు నటించకపోయినా ఫర్వాలేదు.. కథ వింటే చాలు’ అనడంతో మొహమాటానికి కథలు వినేవాళ్లం. కథ విన్న తర్వాత సున్నితంగా తిరస్కరించాలన్నది మా అభిప్రాయం. కానీ, ఇటీవల విన్న ఓ కథను కాదనలేకపోయాం. అంత బాగుంది. దాంతో అంగీకరించాం. ఈ చిత్రం మాత్రమే కాదు.. త్వరలో మరో రెండు చిత్రాలు కూడా జ్యోతిక అంగీకరిస్తుంది’’ అని చెప్పారు. ఇంటికి సంబంధించిన ఏ నిర్ణయమైనా జ్యోతికదేనని, తనే పర్ఫెక్ట్ అని సూర్య చెబుతూ -‘‘జ్యోతిక ప్రతిదీ కేలండర్లో రాసుకుంటుంది. పుట్టినరోజులు, పండగలు, ఇతర వేడుకలు ఏదైనా సరే.. ముందే ఆ విషయాల్లో ప్లాన్ చేసేసుకుంటుంది. నాకంత ప్లానింగ్ ఉండదు. అందుకే, తనని చూసి నేర్చుకుంటున్నాను. పిల్లలకు తల్లీతండ్రీ అన్నీ తానై ఎలా బాధ్యతలు నిర్వర్తిస్తుందో స్వయంగా చూస్తున్నాను. కొన్ని సందర్భాల్లో నాకు గిల్టీగా ఉంటుంది. అందుకే నన్ను నేను కరెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటాను. జ్యోతిక కారణంగా రాను రాను నేను కూడా ‘బెటర్ పర్సన్’ కాగలుగుతున్నాను’’ అని పేర్కొన్నారు. -
పదేళ్ల తర్వాత...
‘చంద్రముఖి’లాంటి సినిమాతో క్లాస్‌నీ మాస్‌నీ ఆకట్టుకున్న నటి జ్యోతిక. హీరో సూర్యని పెళ్లాడాక పూర్తిగా కుటుంబానికే అంకితమైపోయి, నటనకు దూరమయ్యారు. మధ్యలో ఒకటి, రెండు వాణిజ్య ప్రకటనల్లో భర్తతో కలిసి నటించారు. ఆమె సినిమాల కోసం మేకప్ వేసుకుని దాదాపు పదేళ్లవుతోంది. తాజాగా ఆమె రీఎంట్రీకి రంగం సిద్ధమువుతోంది. మలయాళంలో ఘనవిజయం సాధించిన ‘హౌ ఓల్డ్ ఆర్ యూ’ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేయబోతున్నారు. ఇందులో ప్రధాన భూమికను జ్యోతిక పోషించనున్నారు. మాతృకకు దర్శకుడైన రోషన్ ఆండ్రూస్ దర్శకత్వంలో 2డీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది. మహిళా సాధికారత నేపథ్యంలో రూపొందనున్న ఈ చిత్రంలో నటించడం కోసం జ్యోతిక చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారట. -
జ్యోతిక ... హౌ ఓల్డ్ ఆర్ యూ
చెన్నై: ప్రముఖ నటి జ్యోతిక తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించనున్నారా అంటే అవుననే అంటున్నాయి తమిళ సినీ పరిశ్రమ వర్గాలు. మలయాళంలో సూపర్ హిట్ అయిన 'హౌ ఓల్డ్ ఆర్ యూ' చిత్రం తమిళంలో అదే పేరుతో రీమేక్ చేయనున్నారు. 'హౌ ఓల్డ్ ఆర్ యూ' చిత్ర నిర్మాణ హక్కులను జ్యోతిక భర్త, ప్రముఖ హీరో సూర్య సొంత నిర్మాణ సంస్థ '2డీ ఎంటర్టైన్మెంట్' సొంతం చేసుకుంది. మలయాళంలో నిర్మించిన హౌ ఓల్డ్ ఆర్ యూ చిత్రంలో మంజూ వారియర్ ముఖ్య భూమిక పోషించారు. తమిళంలో రీమేక్ అవుతున్న ఆ చిత్రంలోని మంజూ పాత్రలో జ్యోతిక ఒదిగిపోనున్నారు. మలయాళంలో ఆ చిత్రానికి దర్శకత్వం వహించిన రోషన్ అండ్రూస్ తమిళంలో నిర్మిస్తున్న చిత్రానికి కూడా దర్శకత్వ వహించనున్నారు. హీరోహీరోయిన్ జ్యోతిక, సూర్యలు ఒకరినోకరు ప్రేమించుకున్నారు. పెద్దల అనుమతితో ఆ ఇద్దరు ఏడు అడుగులు నడిచారు. అనంతరం జ్యోతిక ఇద్దరు చిన్నారులు దివ్య, దియాలకు జన్మ నిచ్చింది. ఏడేళ్ల విరామం తర్వాత జ్యోతిక మరోసారి తెరంగేట్రం చేయనున్నారు. 2007లో మణికందా తమిళ చిత్రంలో జ్యోతిక నటించారు. ఇదే అమె చివరి చిత్రం అన్న సంగతి తెలిసిందే.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్‌కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్‌పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
టాలీవుడ్లో వరుస హిట్స్.. అప్పుడే ఎంట్రీ ఇస్తోంది!
బెంగుళూరు రేవ్ పార్టీలో టీడీపీ నేతల హస్తం
యూఎస్ జడ్జిగా తొలి తెలుగు మహిళ! వైరల్‌గా ప్రమాణ స్వీకారం..!
నటి కుటుంబం దారుణ హత్య.. తీర్పు వెలువరించిన కోర్టు!
థ్యాంక్యూ డీకే.. అతడి నుంచి ఎంతో స్ఫూర్తిని పొందా: కోహ్లి
ఆర్సీబీపై రాయుడు సంచలన వ్యాఖ్యలు.. నెట్టింట రచ్చ రచ్చ!
యూజర్ ప్రశ్న.. మస్క్ సమాధానం: ట్వీట్స్ వైరల్
Criminal or Devil Review: అదా శర్మ హారర్ మూవీ ఎలా ఉందంటే.. ?
టాలీవుడ్లో నిర్మాత.. బాలీవుడ్‌లోకి డైరెక్టర్‌గా ఎంట్రీ
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఈసీ అనుమతి
తప్పక చదవండి
- ప్రజ్వల్‌కు దేవెగౌడ సూచన... స్పందించిన సిద్ధరామయ్య
- ఆర్సీబీపై రాయుడు సంచలన వ్యాఖ్యలు.. నెట్టింట రచ్చ రచ్చ!
- టీ20 వరల్డ్‌కప్-2024 అంబాసిడర్‌గా ఆఫ్రిది.. దిమ్మతిరిగేలా రైనా కౌంటర్
- 'అదర్ పూనావాలా' రూ.10.5 కోట్ల కారు ఇదే.. చూసారా!
- స్వాతి మలివాల్‌పై దాడి కేసు.. కేజ్రీవాల్ సహాయకుడికి రిమాండ్
- ‘కవిత అరెస్ట్‌లో చట్టపరమైన ఉల్లంఘనలు’.. ఢిల్లీ హైకోర్టులో వాదనలు
- మలాన్ని డోనేట్ చేస్తే ఏడాదికి కోటి రూపాయలు : ఓ కంపెనీ ఆఫర్
- కేటీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్‌లపై పరువు నష్టం దావా: మంత్రి జూపల్లి
- వామ్మో వీళ్లే.. పీఎస్! వీళ్లదే.. కోర్టు తీర్పు!!
- చారిత్రక విజయానికి ఐదేళ్లు...
Advertisement