‘ఆ తుపాను ముందు వ్యక్తి ఇతనే’ | Jr NTR Shares A Picture of SS Rajamouli From RRR Sets | Sakshi
Sakshi News home page

‘ఆ తుపాను ముందు వ్యక్తి ఇతనే’

Aug 28 2019 10:27 AM | Updated on Aug 28 2019 10:27 AM

Jr NTR Shares A Picture of SS Rajamouli From RRR Sets - Sakshi

బాహుబలి లాంటి భారీ చిత్రం తరువాత దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న మరో భారీ చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌లు హీరోలుగా నటిస్తున్న ఈ సినిమా పీరియాడిక్‌ డ్రామాగా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ బల్గేరియాలో జరుగుతోంది. తాజాగా షూటింగ్‌ లొకేషన్‌లో బిజీగా ఉన్న  రాజమౌళి ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజ్‌లో పోస్ట్ చేసిన తారక్‌ ‘తుఫాను ముందు వ్యక్తి’ అంటూ కామెంట్‌ చేశాడు.

బాహుబలితో బాక్సాఫీస్‌ను షేక్‌ చేసిన జక్కన, ఇప్పుడు ఆర్‌ఆర్‌ఆర్‌తో తుఫాను సృష్టించబోతున్నాడని హింట్‌ ఇచ్చారు ఎన్టీఆర్‌. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తుండగా రామ్ చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నాడు. చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతమందిస్తున్నారు.

The MAN before The STORM! #RRR

A post shared by Jr NTR (@jrntr) on

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement