ఇన్‌స్టాగ్రామ్‌లో చేరిన ఎన్టీఆర్‌ 

Jr NTR Makes His Instagram Debut - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంట్రీ ఇచ్చారు. ఎన్టీఆర్‌ సినిమాలు, కుటుంబ సభ్యులకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్‌ చేస్తుంటారు. ఇప్పటికే ట్విటర్‌లో ఎన్టీఆర్‌కి రెండు మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఇక ఎన్టీఆర్ ఇన్‌స్టాగ్రామ్‌లోకి వచ్చిన కొద్దిసేపటికే 70,000 మంది ఫాలోవర్లు చేరడం విశేషం. ఇందులో తన మొదటి పోస్ట్‌గా 'అరవింద సమేత.. వీర రాఘవ' పోస్టర్‌ను పోస్ట్ చేశాడు.

ఎన్టీఆర్ ప్రస్తుతం త్రివిక్రం శ్రీనివాస్‌ దర్శకత్వంలో ‘అరవింద సమేత వీర రాఘవ’  సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన సినిమా ఫస్ట్‌లుక్‌తో ప్రేక్షకులలో మంచి స్పందన వచ్చింది. ఇందులో ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది.హారిక అండ్ హాసిని బ్యానర్ పై రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top