గోవాలో హంగామా | jr.ntr in goa for movie shoot | Sakshi
Sakshi News home page

గోవాలో హంగామా

Oct 27 2014 11:50 PM | Updated on Mar 22 2019 1:53 PM

గోవాలో హంగామా - Sakshi

గోవాలో హంగామా

గోవాకి 15 కిలోమీటర్ల దూరంలో... ఓ అందమైన రిసార్ట్ అది. లొకేషన్ రొమాంటిగ్గా ఉంది. అందుకు తగ్గట్టే అక్కడో అందమైన జంట. అమ్మాయి, అబ్బాయి కలిస్తే... సరసాలు, సరాగాలు,

గోవాకి 15 కిలోమీటర్ల దూరంలో... ఓ అందమైన రిసార్ట్ అది. లొకేషన్ రొమాంటిగ్గా ఉంది. అందుకు తగ్గట్టే అక్కడో అందమైన జంట. అమ్మాయి, అబ్బాయి కలిస్తే... సరసాలు, సరాగాలు, విరాహాలు, విరాగాలు, కోపాలు, తాపాలు ఇవన్నీ సహజమే కదా. వారిద్దరిలో కూడా సేమ్ ఫీలింగ్స్. ఇంతకీ... ఈ అమ్మాయీ, అబ్బాయీ ఎవరనుకుంటున్నారా! ఎన్టీఆర్, కాజల్ అగర్వాల్. ప్రస్తుతం వారిద్దరూ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే. బండ్ల గణేశ్ నిర్మిస్తున్న ఈ చిత్రం తాజా షెడ్యూలు సోమవారం గోవాలో మొదలైంది. అక్కడ ఎన్టీఆర్, కాజల్‌పై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు పూరి. అసలు విషయం అదన్నమాట.
 
 నవంబర్ 28 వరకూ ఈ షెడ్యూల్ ఏకధాటిగా జరుగుతుంది. ఇందులో ఎన్టీఆర్ పోలీసాఫీసర్‌గా నటిస్తున్నారు. వక్కంతం వంశీ ఈ చిత్రానికి కథకుడు. పూరి బయటివారి కథతో సినిమా చేయడం ఇదే ప్రథమం. ఇందులో ఎన్టీఆర్ పాత్ర అత్యంత శక్తిమంతంగా ఉంటుందని సమాచారం. పూరి సినిమాల్లో హీరో పోలీస్ అయితే... ఆ సినిమా సూపర్‌హిట్. అందుకు శివమణి, పోకిరి, గోలీమార్ చిత్రాలే నిదర్శనాలు. ఇప్పటికే హైదరాబాద్‌లో 29 రోజులు షూటింగ్ జరిపారు. ముఖ్యమైన టాకీ పార్ట్‌తో పాటు, ఒక ఐటమ్‌సాంగ్, ఒక ఫైట్‌ని కూడా తొలి షెడ్యూల్‌లో చిత్రీకరించారు. అనూప్ రూబెన్స్ స్వరాలందిస్తున్నారు. ప్రకాశ్‌రాజ్ ప్రతినాయకునిగా నటిస్తున్న ఈ చిత్రానికి ‘టెంపర్’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. సంక్రాంతికి సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement