భారత్లో ఈ కారు మరొకటి లేదు! | John Abraham is Nissan GT-R Black Edition only customer | Sakshi
Sakshi News home page

భారత్లో ఈ కారు మరొకటి లేదు!

Dec 13 2016 6:00 PM | Updated on Sep 4 2017 10:38 PM

భారత్లో ఈ కారు మరొకటి లేదు!

భారత్లో ఈ కారు మరొకటి లేదు!

బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం ఫుల్ జోష్ లో ఉన్నాడు. సినిమాల విషయంలో కాదండోయ్.. అందుకు కారణం ఓ లేటెస్ట్ ఎడిషన్ కారు.

ముంబై: బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం ఫుల్ జోష్ లో ఉన్నాడు. సినిమాల విషయంలో కాదండోయ్.. అందుకు కారణం ఓ లేటెస్ట్ ఎడిషన్ కారు. నిస్సాన్ జీఎటీ-ఆర్ బ్లాక్ ఎడిషన్ మోడల్ కారు మీకు తెలుసుకదండీ. ఇటీవల మార్కెట్లోకి లాంచింగ్ అయిన ఈ కారు దేశంలో కేవలం ఒక్కటే ఉంది. అది కూడా తన వద్దే ఉందని లాంచింగ్ ఈవెంట్లో పాల్గొన్న సందర్భంగా జాన్ అబ్రహం స్వయంగా తెలిపాడు. సాధారణంగా ఈ యాక్షన్ హీరోకు ఖరీదైన, లేటెస్ట్ కార్లు, బైక్స్ అంటే ఇష్టమన్న విషయం తెలిసిందే. ఈ ఖరీరైన కారు ఖరీదు భారత్ లో దాదాపు రెండు కోట్లు(రూ.1.99 కోట్లు).

మొదట తాను నిస్సాన్ జీఎటీ-ఆర్ బ్లాక్ ఎడిషన్ ఫస్ట్ కస్టమర్ అని చెప్పిన ఈ హీరో అసలు విషయాన్ని దాచాడు. ఫస్ట్ కస్టమర్ మాత్రమే కాదు వన్ అండ్ ఓన్లీ కస్టమర్ అని. తన ఫేస్ బుక్ అకౌంట్లో ఓ వీడియోతో పాటు కారు వివరాలను పోస్ట్ చేశాడు. ఇప్పటికే ఆ వీడియోను 14 లక్షల మంది వీక్షించారంటే మాటలు కాదు. అయితే నిస్సాన్ కంపెనీ గతంలో తీసుకొచ్చిన మోడల్స్ కంటే కూడా ఈ ఎడిషన్ అందర్నీ ఆకట్టుకుంటుందని సమాచారం. 3.8 లీటర్ల వీ6 ఇంజిన్ ఉన్న ఈ కారు కేవలం మూడు సెకన్లలోపే 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని తన పోస్ట్ లో రాసుకొచ్చాడు.


Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement