టాలీవుడ్‌కి మిస్‌ యూఎస్‌ఏ | Jo Sharma ( Jyotsna ) Winner of Miss USA International Beauty contest | Sakshi
Sakshi News home page

టాలీవుడ్‌కి మిస్‌ యూఎస్‌ఏ

Apr 13 2019 12:49 AM | Updated on Apr 13 2019 12:49 AM

Jo Sharma ( Jyotsna ) Winner of Miss USA International Beauty contest - Sakshi

జో శర్మ

బ్యూటీ కాంటెస్టుల్లో గెలిచిన భామలు హీరోయిన్లుగా సినిమాల్లో ఎంపిక కావడం గతంలో చాలాసార్లు చూశాం. సుస్మితా సేన్, ఐశ్వర్యా రాయ్, ప్రియంకా చోప్రా వంటి తారలు ముందు అందాల పోటీల్లో పాల్గొని, లైమ్‌లైట్‌లోకి వచ్చారు. అక్కడ్నుంచి సినిమాల్లోకి వచ్చారు. లేటెస్ట్‌గా జో శర్మ (జ్యోత్స ్న) ఈ లిస్ట్‌లో జాయిన్‌ కాబోతున్నారు. కాలిఫోర్నియాలో జరిగిన యూఎస్‌ఏ ఇంటర్నేషనల్‌ బ్యూటీ అండ్‌ టాలెంట్‌ కాంటెస్ట్‌ 2019 విజేతగా నిలిచారు జో శర్మ.

15 దేశాలకు చెందిన 15 మంది ఈ పోటీలో పాల్గొన్నారు. అందం, ప్రతిభ, నృత్యం, ఉమెన్‌ ఎంపవర్‌మెంట్‌ స్పీచులు.. ఇలా అన్నింటి ఆధారంగా విజేతను నిర్ణయించారు. అన్నింటిలోనూ జో శర్మ తన ప్రతిభ కనబర్చి, ‘మిస్‌ యూఎస్‌ఏ’ టైటిల్‌ గెలిచారు. త్వరలో ఆమె టాలీవుడ్‌కి పరిచయం కానున్నారు. ప్రస్తుతం ‘లవ్‌ 2020’ చిత్రాన్ని రూపొందిస్తున్న నిర్మాత మోహన్‌ వడ్లపాటి త్వరలో రూపొందించబోయే మరో చిత్రం ద్వారా జో శర్మను హీరోయిన్‌గా పరిచయం చేయనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement