ప్రభాస్‌కు స్పెషల్ థ్యాంక్స్ | Jil Movie Success Meet | Sakshi
Sakshi News home page

ప్రభాస్‌కు స్పెషల్ థ్యాంక్స్

Mar 31 2015 11:02 PM | Updated on Sep 2 2017 11:38 PM

ప్రభాస్‌కు స్పెషల్ థ్యాంక్స్

ప్రభాస్‌కు స్పెషల్ థ్యాంక్స్

ఈ సినిమా చూసిన వాళ్లందరూ నా లుక్ చాలా బాగుందని అంటున్నారు. నా లుక్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ

‘‘ఈ సినిమా చూసిన వాళ్లందరూ నా లుక్ చాలా బాగుందని అంటున్నారు. నా లుక్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న ప్రభాస్‌కు నా స్పెషల్ థ్యాంక్స్’’ అని గోపీచంద్ చెప్పారు. యూవీ క్రియేషన్స్ పతాకంపై గోపీచంద్, రాశీ ఖన్నా జంటగా రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో వంశీ-ప్రమోద్ నిర్మించిన ‘జిల్’ ఇటీవల విడుదలైంది. ఈ సినిమా విజయోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ -‘‘సినిమా విజయం సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. సావిత్రిగా రాశీ ఖన్నా చాలా బాగా నటించారు ’’ అని చెప్పారు. ఈ చిత్రాన్ని ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలని నిర్మాతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చలపతిరావు, అమిత్, విక్కీ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement