ప్రతిష్టాత్మక చిత్రంలో జాన్వీ కపూర్‌!

Jhanvi Kapoor Next Movie Takht Was Announced - Sakshi

‘ధడక్‌’ చిత్రంతో జాన్వీ కపూర్‌ ఆకట్టుకున్నారు. జాన్వీ అందం, అభినయంతో సినీ అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇక ఈ సినిమా తరువాత జాన్వీకి అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. సౌత్‌ సినిమాల్లో కూడా జాన్వీని నటించపజేయాలని బడా నిర్మాతలు ప్రయత్నిస్తున్నారని సమాచారం. 

బాలీవుడ్‌లో జాన్వీ నటించబోయే తదుపరి సినిమాను అధికారికంగా ప్రకటించేశారు. ‘తక్త్‌’ అనే చారిత్రాత్మక చిత్రంలో జాన్వీ నటిస్తున్నారు. ఈ మూవీకి కరణ్‌ జోహార్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో రణ్‌వీర్‌సింగ్‌, కరీనా కపూర్‌, అలియా భట్‌, విక్కీ కౌశల్‌, భూమి ఫెడ్నేకర్‌, అనిల్‌ కపూర్‌లు ముఖ్యపాత్రల్లో నటించనున్నారు. ధర్మ ప్రొడక్షన్స్‌పై తెరకెక్కుతున్న ఈ మూవీ 2020లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top