'మా' ఎన్నికలు ఇంత దారుణమా? | Jayasudha reacts over maa elections | Sakshi
Sakshi News home page

'మా' ఎన్నికలు ఇంత దారుణమా?

Mar 27 2015 6:24 PM | Updated on Sep 2 2017 11:28 PM

'మా' ఎన్నికలు ఇంత దారుణమా?

'మా' ఎన్నికలు ఇంత దారుణమా?

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మంచి, చెడులు మాకు తెలుసునని ప్రముఖ నటి జయసుధ తెలిపారు.

హైదరాబాద్: టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మంచి, చెడులు మాకు తెలుసునని ప్రముఖ నటి జయసుధ తెలిపారు. శుక్రవారం ఫిలిం చాంబర్స్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో జయసుధ 'మా' ఎన్నికల వివాదంపై స్పందించారు. నన్ను పోటీ చేయమని అడిగారు కాబట్టి మా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నానని ఆమె స్పష్టం చేశారు. కానీ జరుగుతున్న రాజకీయాలు చూసి ఆశ్చర్యపోయానన్నారు. 'మా' ఎన్నికలు ఇంత దారుణంగా ఉంటాయనుకోలేదన్నారు.

ఒకరిపై ఒకరు బురద జల్లుకోవాల్సిన అవసరం లేదని ఆమె పేర్కొన్నారు. నిజాలు మాట్లాడితే చాలా మంది బాధపడతారని వ్యాఖ్యానించారు. నేను డమ్మీ అభ్యర్థిని కాదు... నాకు కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయని జయసుధ చెప్పారు. సభ్యులు 900 మంది ఉన్నా... ఓటు హక్కు 702 మందికి మాత్రమే ఉందన విషయాన్ని ఆమె ఈ సందర్బంగా గుర్తు చేశారు. పేద కళాకారుల ఇంట్లో పెళ్లికి ఎంత సహాయం కావాలో అంతా చేస్తామని జయసుధ హామీ ఇచ్చారు. మా ప్యానెల నుంచి ఫండ్ తీసుకొన్న తర్వాతే మిగతా వారి నుంచి ఫండ్ తీసుకుంటామని జయసుధ వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement