బోయపాటి స్టైల్.. జయ జానకి నాయక | jaya janaki nayaka making video | Sakshi
Sakshi News home page

బోయపాటి స్టైల్.. జయ జానకి నాయక

Aug 6 2017 10:41 AM | Updated on Aug 3 2019 12:45 PM

బోయపాటి స్టైల్.. జయ జానకి నాయక - Sakshi

బోయపాటి స్టైల్.. జయ జానకి నాయక

స్టార్ వారసుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా.. స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన

స్టార్ వారసుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా.. స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఫ్యామిలీ యాక్షన్ డ్రామా జయ జానకి నాయక. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

ఇప్పటికే భారీ ప్రమోషన్ లో హైప్ క్రియేట్ చేస్తున్న చిత్రయూనిట్ తాజాగా మేకింగ్ వీడియోను రిలీజ్ చేసింది. హై ఎమోషన్ సీన్ షూటింగ్ సమయంలో హీరో హీరోయిన్లకు నటించి చూపిస్తున్న దర్శకుడు మరోసారి తన మార్క్ చూపించాడని అర్ధమవుతోంది. ఇప్పటికే యాక్షన్ ఎమోషనల్ టీజర్ లతో ఆకట్టుకున్న బోయపాటి.. మేకింగ్ ను యాక్షన్, ఎమోషనల్ సీన్స్ తో కట్ చేయించాడు.

Advertisement
 
Advertisement
Advertisement