'జవాన్' వచ్చేస్తున్నాడు..! | Jawaan Release Date Fixed | Sakshi
Sakshi News home page

'జవాన్' వచ్చేస్తున్నాడు..!

Sep 29 2017 2:10 PM | Updated on Sep 29 2017 2:10 PM

Jawaan

తిక్క, విన్నర్ సినిమాలు నిరాశపరచటంతో ఇబ్బందుల్లో పడ్డ సాయి ధరమ్ తేజ్, జవాన్ సినిమాతో అలరించేందుకు రెడీ అవుతున్నాడు. బీవీయస్ రవి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాడు సాయి. అయితే ఈ సినిమా షూటింగ్ చాలా రోజులుగా జరుగుతున్నా.. రిలీజ్ డేట్ విషయంలో మాత్రం క్లారిటీ రాలేదు.

తాజా ఈ సినిమా రిలీజ్ కు డేట్ ఫిక్స్ చేశారన్న టాక్ వినిపిస్తోంది. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను నవంబర్ 3న రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. ఈలోగా దిల్ రాజు బ్యానర్ లోనే తెరకెక్కిన రాజా ది గ్రేట్ సినిమాను అక్టోబర్ 18న రిలీజ్ చేసి తరువాత కాస్త గ్యాప్ తీసుకొని జవాన్ సినిమాను రిలీజ్ చేయనున్నారు. అదే రోజు ఆది హీరోగా తెరకెక్కిన నెక్ట్స్ నువ్వే సినిమా కూడా రిలీజ్ అవుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement