‘నీ ప్రేమే నన్ను నడిపిస్తుంది’

Janhvi Kapoor Includes A Note For Mom Sridevi To Paid Tribute - Sakshi

లెజండరీ యాక్టర్‌ శ్రీదేవి గారాల పట్టి జాన్వీ కపూర్‌కి జులై 20 చాలా ప్రత్యేకమైన రోజు. నటిగా ఆమె బాలీవుడ్‌ ప్రయాణం ప్రారంభమైంది ఆ రోజే. జాన్వీ కపూర్‌ తన తొలి చిత్రం ‘ధడక్‌’ సినిమాతో బాలీవుడ్‌లో ప్రవేశించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో కుటుంబం మొత్తం జాన్వీకి మద్దతుగా ఉంది. కానీ ఎందరు ఉన్న తల్లి లేని లోటును మాత్రం ఎవరూ పూడ్చలేరు. జాన్వీ తొలి సినిమా ‘ధడక్‌’ గురించి శ్రీదేవి చాలా ఆత్రుతగా ఎదురుచూసేవారనే సంగతి తెలిసిందే. కానీ దురదృష్టం కొద్ది సినిమా విడుదల సమయానికి ఆమె మన మధ్యలో లేరు. దాంతో తన తొలి చిత్రాన్ని తల్లి అంకితం చేసి, నివాళులు అర్పించారు జాన్వీ కపూర్‌.

అందులో భాగంగా సినిమా ప్రారంభానికి ముందు తన తల్లిని ఉద్దేశిస్తూ జాన్వీ ఒక స్పేషల్‌ నోట్‌ను ప్రదర్శించారు. దానిలో శ్రీదేవి నటించిన ఇంగ్లీష్‌ వింగ్లీష్‌ చిత్రంలోని ఒక అందమైన ఫోటో, దానితో పాటు ‘ఐ లవ్‌ యూ అమ్మ. ఇది నీ కోసం. ఎప్పటికి జాన్వీ’ అనే సందేశం. ఈ నోట్‌ను తెర మీద చూసిన ప్రతి ఒక్కరు ఒక్క క్షణం ఉద్వేగానికి లోనయ్యారు. అంతేకాక ఈ నోట్‌లో జాన్వీతో పాటు మొత్తం కుటుంబ సభ్యులందరూ శ్రీదేవి అభిమానులకు, మీడియా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ‘శ్రీదేవి మరణించిన సమయంలో మీరు(మీడియా, అభిమానులు) చూపిన ప్రేమకు, గౌరవానికి ధన్యవాదాలు’ అని రాసి ఉంది. 

దీని కంటే ముందే జాన్వీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో తన తల్లిని ఉద్దేశిస్తూ ఒక సుదీర్ఘమైన సందేశాన్ని పోస్టు చేశారు. ఈ సందేశంలో జాన్వీ‘ఇప్పుడు నా హృదయంలో అనంతమైన శూన్యం ఏర్పడింది. ఇక మీదట నేను దానితోనే సహవాసం చేయాల్సి ఉంటుంది. ఎంత శూన్యత ఉన్న ఇప్పటికి నీ ప్రేమను నేను అనుభవించగల్గుతున్నాను. నేను ఎప్పుడు కళ్లు మూసుకున్న ఎన్నో మంచి జ్ఞాపకాలు నా కళ్ల ముందు మెదులుతుంటాయి. నువ్వు చాలా స్వచ్ఛంగా, నిండు మనసుతో ప్రేమిస్తూంటావు. అందుకే అతను(దేవుడు) నిన్ను తన చెంతకు పిలిపించుకున్నాడు. కానీ నువ్వు మా కోసం ఎప్పటికి ఉంటావు.

నా స్నేహితులు ఎప్పుడు అంటుండేవారు, నేను చాలా అదృష్టవంతురాలినని. అలా ఎందుకనేవారో నాకు ఇప్పుడు అర్ధం అవుతుంది. ఎందుకంటే నువ్వు ఎల్లప్పుడు నాతోనే ఉన్నావు. నేను ఎప్పుడూ.. ఎవరి మీద దేని కోసం ఆధారపడలేదు. ఎందుకంటే నువ్వు ఎల్లప్పుడు నా కోసం ఉన్నావు. నువ్వు నా ఆత్మలో భాగం. నా ప్రియ నేస్తానివి. నాకు సంబంధించిన ప్రతిది నువ్వే. మాపై నీ ప్రభావం చాలా బలమైనది. మేము ముందుకు వెళ్లడానికి ఇది తోడ్పడుతుంది. కానీ నువ్వు లేని లోటును మాత్రం అది పూర్తిగా తీర్చలేదు’ అంటూ తన తల్లికి నివాళులు అర్పించారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top