జానకి గారికి వీరాభిమానిని - కమల్‌హాసన్ | Janaki garu superfandom says Kamal Haasan | Sakshi
Sakshi News home page

జానకి గారికి వీరాభిమానిని - కమల్‌హాసన్

Jul 23 2015 11:21 PM | Updated on Sep 3 2017 6:02 AM

జానకి గారికి వీరాభిమానిని - కమల్‌హాసన్

జానకి గారికి వీరాభిమానిని - కమల్‌హాసన్

‘‘ప్రముఖ గాయని ఎస్. జానకిగారు తన కెరీర్‌లో ఎన్నో గొప్ప గొప్ప పాటలు పాడారు. ఆమెకు నేను వీరాభిమానిని. ఆమెను జీవన సాఫల్య పురస్కారంతో సత్కరించే అవకాశం రావడం నా అదృష్టం’’

‘‘ప్రముఖ గాయని ఎస్. జానకిగారు తన కెరీర్‌లో ఎన్నో గొప్ప గొప్ప పాటలు పాడారు. ఆమెకు నేను వీరాభిమానిని. ఆమెను జీవన సాఫల్య పురస్కారంతో సత్కరించే అవకాశం రావడం నా అదృష్టం’’ అని కమల్‌హాసన్ చెప్పారు. 2014కు సంబంధించి రేడియో మిర్చి సౌత్ మ్యూజిక్ అవార్డ్స్ వేడుక బుధవారం రాత్రి హైదరాబాద్‌లో కన్నుల పండువగా జరిగింది.
 
 తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలకు చెందిన ప్రముఖ నటీనటులు, గాయనీ గాయకులు, సంగీత దర్శకులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ప్రముఖ గాయని ఎస్. జానకికి కమల్‌హాసన్ చేతుల మీదుగా జీవన సాఫల్య పురస్కారం అందించి సత్కరించారు. ఈ సందర్భంగా ఎస్. జానకి స్పందిస్తూ -‘‘పాటే నాకు ప్రాణం. పాటే నా ప్రయాణం. దక్షిణాదిలో అన్ని భాషల్లోనూ పాటలు పాడాను’’ అన్నారు. ఈ వేడుకలో మహేశ్‌బాబు, అల్లు అర్జున్, ఖుష్బూ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement