జై సేన సూపర్‌హిట్‌ అవ్వాలి | jai sena movie song launch | Sakshi
Sakshi News home page

జై సేన సూపర్‌హిట్‌ అవ్వాలి

Jun 25 2019 3:18 AM | Updated on Jun 25 2019 3:18 AM

jai sena movie song launch - Sakshi

పాట ఆవిష్కరణలో బి.గోపాల్‌తో సునీల్, వి.సముద్ర...

‘‘జై సేన’ సినిమా కథాంశం కొత్తగా ఉంది. ఆరుగురు యంగ్‌స్టర్స్‌తోపాటు శ్రీకాంత్, సునీల్‌ మంచిపాత్రలు చేశారు. ఈ సినిమా సూపర్‌హిట్‌ అవ్వాలని కోరుకుంటున్నా’’ అన్నారు దర్శకుడు బి.గోపాల్‌. శ్రీకాంత్, సునీల్, శ్రీ, పృథ్వి, ప్రవీణ్, కార్తికేయ ముఖ్య తారలుగా వి.సముద్ర దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘జై సేన’. వి.విజయలక్ష్మి సమర్పణలో వి.సాయి అరుణ్‌కుమార్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోని ‘సేన జైసేన... యుద్ధం చెయ్‌...’ అంటూ సాగే మొదటి పాటను బి.గోపాల్‌ రిలీజ్‌ చేశారు.

సునీల్‌ మాట్లాడుతూ– ‘‘జై సేన’లో సీరియస్‌ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్ర చేశాను. అప్పట్లో టి.కృష్ణగారు మంచి సందేశంతో సినిమాలు తీసేవారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘రేపటిపౌరులు’ సినిమా చాలా బాగుంటుంది. ఆ కోవలో మంచి మెసేజ్‌తో చేసిన ‘జై సేన’ కూడా తప్పకుండా అందరికీ నచ్చుతుంది’’ అన్నారు. వి.సముద్ర మాట్లాడుతూ– ‘‘బి.గోపాల్‌గారి చేతుల మీదుగా మొదటి పాట విడుదల కావడం సంతోషం. ఈ పాటను, సునీల్‌ అన్నయ్య పాత్ర డైలాగ్స్‌ను చందు బాగా రాశాడు.  ఇండస్ట్రీలో మంచి వ్యక్తి అంటే కృష్ణగారి గురించి చెబుతాం.. శ్రీకాంత్‌ కూడా కృష్ణగారి అంత మంచి వ్యక్తి. పొలిటికల్‌ లీడర్స్‌ని, యూత్‌తో పాటు అందర్నీ ఆలోచింపజేసే సినిమా ఇది’’ అన్నారు. సహ నిర్మాత శిరీష్‌రెడ్డి, నటీనటులు ప్రీతి శర్మ, నీతు గౌడ, ప్రవీణ్, అభిరామ్, కార్తికేయ, హరీష్‌ గౌతమ్, రచయిత చందు తదితరులు మాట్లాడారు.
 

Advertisement
 
Advertisement
Advertisement