ముగ్గురూ ఒక్కటై | jai lova kusa movie updates | Sakshi
Sakshi News home page

ముగ్గురూ ఒక్కటై

Sep 6 2017 12:09 AM | Updated on Sep 17 2017 6:26 PM

ముగ్గురూ ఒక్కటై

ముగ్గురూ ఒక్కటై

‘ఐకమత్యం మహాబలం’ అన్నారు పెద్దలు. అదెలా ఉంటుందో చూపిస్తామంటున్నారు ముగ్గురు అన్నదమ్ములు.

‘ఐకమత్యం మహాబలం’ అన్నారు పెద్దలు. అదెలా ఉంటుందో చూపిస్తామంటున్నారు ముగ్గురు అన్నదమ్ములు. వాళ్లే... జై, లవ, కుశ. ఈ ముగ్గురూ కలసి ఐకమత్యంగా శత్రువులను ఎలా అంతం చేశారనేది క్లుప్తంగా ‘జై లవ కుశ’ కథ. ఎన్టీఆర్‌ హీరోగా కె.ఎస్‌. రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో నందమూరి కల్యాణ్‌రామ్‌ నిర్మిస్తున్న చిత్రమిది. ఎన్టీఆర్‌ త్రిపాత్రాభినయం చేస్తున్నారు. ముగ్గురిలో జై, లవకుమార్‌ పాత్రలు ఎలా ఉండబోతున్నాయనేది టీజర్స్‌ ద్వారా తెలిసింది.

ఇప్పుడు కుశ టీజర్‌ కోసం ప్రేక్షకులు వెయిటింగ్‌. మూడు పాత్రలు వేర్వేరు, పాత్ర చిత్రణలు వేర్వేరు అయినప్పటికీ... వాళ్ల టార్గెట్‌ మాత్రం ఒక్కరే! అదెవరు? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌. ఈ నెల 10న థియేట్రికల్‌ ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. అందులో ఏమైనా క్లూ ఇస్తారేమో? చూడాలి! 10నే ప్రీ–రిలీజ్‌ వేడుక నిర్వహించనున్న సంగతి తెలిసిందే. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతమందించిన పాటల్ని ఇటీవలే విడుదల చేశారు. ఈ నెల 21న ప్రపంచవ్యాప్తంగా సినిమాను విడుదల చేయనున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement