‘ఐస్‌క్రీమ్’ ప్రేరణతో... | Jai Akash Chocolate film status quo | Sakshi
Sakshi News home page

‘ఐస్‌క్రీమ్’ ప్రేరణతో...

Published Mon, Oct 27 2014 11:00 PM | Last Updated on Sat, Sep 2 2017 3:28 PM

‘ఐస్‌క్రీమ్’ ప్రేరణతో...

 జై ఆకాశ్, తమన్ హీరోలుగా, అర్చన కథానాయికగా రూపొందనున్న చిత్రం ‘చాక్లెట్’. ‘ఎ స్వీట్ లవ్‌స్టోరి’ అనేది ఉపశీర్షిక. రామకృష్ణ వీర్నాల దర్శకుడు. రావుట్ల లింగం నిర్మాత. త్వరలోనే సెట్స్‌కి వెళ్లనున్న ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ -‘‘రామ్‌గోపాల్‌వర్మ ‘ఐస్‌క్రీమ్’ ప్రేరణతో హాస్యం కలగలిపిన రొమాంటిక్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించనున్నాం’’ అని తెలిపారు. ‘సత్యం’రాజేశ్, ‘చిత్రం’శ్రీను, ‘ఛత్రపతి’ శేఖర్, పొట్టి విజయ్, ఆర్కేవి, సౌజన్య, అలీభాయ్, వాసు తదితరులు ఇతర పాత్రలు పోషించనున్న ఈ చిత్రానికి కెమెరా: రామరాజు, సంగీతం: ఎల్.ఎం.ప్రేమ్.
 

Advertisement
 
Advertisement
 
Advertisement