హీరో కంటే బాగా చూస్తున్నారు | jagapatibabu about his Character in moives | Sakshi
Sakshi News home page

హీరో కంటే బాగా చూస్తున్నారు

Dec 5 2016 12:07 AM | Updated on Sep 4 2017 9:54 PM

హీరో కంటే  బాగా చూస్తున్నారు

హీరో కంటే బాగా చూస్తున్నారు

‘‘సాధారణంగా విలన్ అంటే చులకనభావంతో చూస్తారు. కానీ, నా కోసమే ‘నాన్నకు ప్రేమతో’లో పాత్రను గౌరవంగా చూపించానని సుకుమార్ ఓసారి చెప్పారు.

‘‘సాధారణంగా విలన్ అంటే చులకనభావంతో చూస్తారు. కానీ, నా కోసమే ‘నాన్నకు ప్రేమతో’లో పాత్రను గౌరవంగా చూపించానని సుకుమార్ ఓసారి చెప్పారు. ఇప్పుడు చిత్ర పరిశ్రమలో నన్ను హీరో కంటే బాగా చూస్తున్నారు’’ అన్నారు జగపతిబాబు. మోహన్‌లాల్ హీరోగా, ఆయన విలన్‌గా నటించిన ‘మన్యం పులి’ గత శుక్రవారం విడుదలైంది. జగపతిబాబు మాట్లాడుతూ - ‘‘మలయాళ ప్రేక్షకులు నన్ను నా పేరుతో కాకుండా ఈ చిత్రంలో చేసిన  ‘డాడీ గిరిజ’ పాత్ర పేరుతో పిలుస్తున్నారు. అంత మంచి పేరొచ్చింది.

తెలుగులోనూ ఈ సినిమా హిట్ కావడం హ్యాపీగా ఉంది. మలయాళంలో మోహన్‌లాల్‌తో మరో సినిమా చేయబోతున్నా. గోపీచంద్, నాగచైతన్య, సాయిధరమ్ తేజ్‌లతో సినిమాలు చేస్తున్నాను. నేను హీరోగా చేయబోయే ‘పటేల్‌సార్’ త్వరలో ప్రారంభమవుతుంది. 60 ఏళ్ల వృద్ధుడికీ, అంధురాలైన చిన్నారికీ మధ్య జరిగే కథే ఆ చిత్రం’’ అన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement