వెల్‌కమ్‌ అల్లుడు గారు! | Jagapathi Babu Tweet About SS Karthikeya | Sakshi
Sakshi News home page

Jan 12 2019 7:46 AM | Updated on Jan 12 2019 7:47 AM

Jagapathi Babu Tweet About SS Karthikeya - Sakshi

వెల్‌కమ్‌ అల్లుడు గారు అంటూ తమ కొత్త అల్లుడికి స్వాగతం పలుకుతున్నారు మన జగ్గూభాయ్‌. ఇటీవలే జైపూర్‌లో రాజమౌళి తనయుడు కార్తికేయ, జగపతి బాబు అన్న కుమార్తె పూజా ప్రసాద్‌ల వివాహం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. 

ఈ పెళ్లిలో రాజమౌళి, ఎన్టీఆర్‌, కీరవాణి, రానా, ప్రభాస్‌, రామ్‌ చరణ్‌లు చేసిన సందడి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఈ తమ ఇంట్లోకి రాబోతోన్న కొత్త అల్లుడికి జగపతి బాబు సోషల్‌ మీడియా వేదికగా వెల్‌కమ్‌ చెప్పారు. ‘పూజ, కార్తికేయల వివాహ సంబరాల కారణంగా హైదరాబాద్ కొన్ని అద్భుతమైన ఫోటోలను సంపాదించింది. అల్లుడు గారి కుటుంబం మా జీవితాల్లోకి రావడంతో మా కుటుంబం పరిపూర్ణమైంది. వెల్‌కమ్ అల్లుడుగారు’అంటూ ట్వీట్‌ చేశారు.  

Advertisement
 
Advertisement
Advertisement