వారికోసమైనా ‘ఆటగాళ్ళు’ ఆడాలి | Jagapathi Babu Speech Aatagallu Movie Press Meet | Sakshi
Sakshi News home page

వారికోసమైనా ‘ఆటగాళ్ళు’ ఆడాలి

Aug 23 2018 1:01 AM | Updated on Aug 23 2018 1:01 AM

Jagapathi Babu Speech Aatagallu Movie Press Meet - Sakshi

నారా రోహిత్, పరుచూరి మురళి, జగపతిబాబు

‘‘ఆటగాళ్ళు’ వంటి సినిమా చేయడం కొంతవరకూ రిస్కే. అయినా నిర్మాతలు బడ్జెట్‌లో రాజీ పడకుండా ఈ సినిమా గ్రాండ్‌గా నిర్మించారు. మేమంతా బాగా ఇన్వాల్వ్‌ అయి ఈ సినిమా చేశాం. మా కోసం కాకపోయినా నిర్మాతల కోసమైనా ఈ సినిమా ఆడాలి’’ అని నటుడు జగపతిబాబు అన్నారు. నారా రోహిత్, దర్శనా బానిక్‌ జంటగా జగపతిబాబు ముఖ్యపాత్రలో పరుచూరి మురళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆటగాళ్ళు’.

వాసిరెడ్డి రవీంద్రనాథ్, వాసిరెడ్డి శివాజీప్రసాద్, మక్కెన రాము, వడ్లపూడి జితేంద్ర నిర్మించిన ఈ సినిమా రేపు రిలీజ్‌ అవుతున్న సందర్భంగా ప్రెస్‌మీట్‌లో జగపతిబాబు మాట్లాడుతూ– ‘‘నేనీ సినిమా చేయడానికి ప్రధాన కారణం డైరెక్టర్‌ మురళి. నాతో ‘పెదబాబు’ సినిమా చేశాడు. ‘ఆటగాళ్ళు’ అవుట్‌పుట్‌ చూశాక కచ్చితంగా సక్సెస్‌ అవుతుందనిపించింది’’ అన్నారు. ‘‘ఆటగాళ్ళు’ చిత్రంలో ఫస్ట్‌ టైమ్‌ కొత్త జోనర్‌ చేశా. నన్ను కన్విన్స్‌ చేసి ఈ చిత్రం తీసిన మురళికి ధన్యవాదాలు. ఈ సినిమా బాగా ఆడి నిర్మాతలకు డబ్బులొస్తే వారు మరిన్ని సినిమాలు తీస్తారు’’ అన్నారు నారా రోహిత్‌. ‘‘ఈ చిత్ర నిర్మాతలు నా ఫ్రెండ్సే. వాళ్లు లేకపోతే ఈ సినిమా లేదు’’ అన్నారు పరుచూరి మురళి. ‘‘ఫ్రెండ్‌ కోసం ఓ పర్పస్‌తో ఈ సినిమా చేశాం’’ అన్నారు వాసిరెడ్డి రవీంద్రనాథ్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement