ఇప్పుడు వంటూర్‌ వంతు | Iulia Vantur to make her acting debut in Bollywood | Sakshi
Sakshi News home page

ఇప్పుడు వంటూర్‌ వంతు

Aug 21 2018 1:40 AM | Updated on Aug 21 2018 1:40 AM

Iulia Vantur to make her acting debut in Bollywood - Sakshi

సల్మాన్‌ ఖాన్‌, లూలియా వంటూర్‌

సల్మాన్‌ ఖాన్‌ మనసుకు నచ్చాలే కానీ అవకాశాలకు కొదవ ఉండదు అంటుంటారు ముంబై మీడియా. అంతలా ప్రోత్సహిస్తుంటారు తన మనసుకి దగ్గరైనవారిని. కత్రినా కైఫ్, జాక్వెలిన్, జరీన్‌ ఖాన్‌.. ఇలా సల్మాన్‌ ఎంకరేజ్‌ చేసిన తారల లిస్ట్‌ పెద్దగానే ఉంది. రీసెంట్‌గా సూరజ్‌ పాంచోలీ, తన బామ్మరిది ఆయుష్‌ శర్మను కూడా తన ప్రొడక్షన్‌ హౌస్‌ ద్వారా హీరోలుగా పరిచయం చేశారు. ఇప్పుడు ఈ లిస్ట్‌లోకి భాయ్‌ మనసుని దోచేసుకున్న లూలియా వంటూర్‌ కూడా జాయిన్‌ అయ్యారని సమాచారం.

ఈ రొమేనియన్‌ యాక్టర్‌ సల్మాన్‌ మనసు దోచేసుకున్నారనే టాక్‌ ఎప్పటినుంచో ఉంది.  ఆల్రెడీ సల్మాన్‌ ‘రేస్‌ 3’ సినిమాలో సల్మాన్‌ రాసిన ‘సెల్ఫిష్‌’ సాంగ్‌ను పాడారు లూలియా. దర్శకుడు ప్రేమ్‌ సోనీ రూపొందించబోయే లేటెస్ట్‌ సినిమాలో లూలియా వంటూర్‌ను హీరోయిన్‌గా సెలెక్ట్‌ చేసుకోవాలనుకుంటున్నారట సల్మాన్‌. రణ్‌దీప్‌ హుడా హీరోగా నటించనున్న ఈ సినిమాను సల్మాన్‌ ఖాన్‌ సొంత బ్యానర్‌పై నిర్మించాలనుకుంటున్నారని సమాచారం. సో.. సల్మాన్‌ పరిచయం చేసిన నాయికలలాగే లూలియా వంటూర్‌ కూడా పెద్ద సక్సెస్‌ను అందుకుంటారో లేదో వేచి చూడాలి.

Advertisement
 
Advertisement
Advertisement