అల్లు అర్జున్కు కొడుకు పుట్టాడు | It is a baby boy for Allu Arjun | Sakshi
Sakshi News home page

అల్లు అర్జున్కు కొడుకు పుట్టాడు

Apr 4 2014 1:50 PM | Updated on Sep 2 2017 5:35 AM

అల్లు అర్జున్కు కొడుకు పుట్టాడు

అల్లు అర్జున్కు కొడుకు పుట్టాడు

టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ తండ్రి అయ్యాడు. అర్జున్ భార్య స్నేహారెడ్డి ఓ అబ్బాయికి జన్మనిచ్చింది.

టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ తండ్రి అయ్యాడు. అర్జున్ భార్య స్నేహారెడ్డి ఓ అబ్బాయికి జన్మనిచ్చింది. ''అల్లు అర్జున్, స్నేహారెడ్డిలకు కొడుకు పుట్టాడు. తల్లీ కొడుకులు ఆరోగ్యంగా ఉన్నారు'' అని అర్జున్ మేనేజర్ తెలిపారు. 2003లో గంగోత్రి సినిమాతో తెరంగేట్రం చేసిన అల్లు అర్జున్.. 2011 మార్చిలో స్నేహారెడ్డిని పెళ్లి చేసుకున్నాడు. అర్జున్ హీరోగా నటించిన రేసుగుర్రం చిత్రం ఈనెల 11వ తేదీ శుక్రవారం విడుదల కానుంది. (చదవండి: పెదవి దాటని తీపి కబురు)

తన భార్య గర్భవతి అన్న విషయాన్ని అల్లు అర్జున్ తన ఫేస్బుక్ అకౌంట్ ద్వారా పదిమందితో పంచుకున్నారు.  ‘ఎక్స్‌పెక్టింగ్ ఎనీ టైమ్’ అంటూ తన ఫేస్‌బుక్‌లో ఈ ఫొటో పెట్టారు బన్నీ. ఆ ఫొటోలో.. తాము తల్లిదండ్రులం కాబోతున్నామనే ఆనందం బన్నీ, స్నేహల్లో స్పష్టంగా కనిపించింది. ఈనెల 8వ తేదీన అర్జున్ పుట్టినరోజు.

Advertisement
 
Advertisement
Advertisement