మహేశ్‌ మేనల్లుడితో ‘ఇస్మార్ట్‌’బ్యూటీ

Ismart Heroine Nidhi Agarwal New Telugu Movie With Ashok Galla - Sakshi

అశోక్ గ‌ల్లా డెబ్యూ మూవీ హీరోయిన్‌గా నిధి అగ‌ర్వాల్‌

న‌వంబ‌ర్ 10న గ్రాండ్ ఓపెనింగ్‌

ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త‌, పార్ల‌మెంట్ స‌భ్యుడు జ‌య‌దేవ్ గ‌ల్లా త‌న‌యుడు అశోక్ గ‌ల్లా హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఇవ్వ‌నున్నారు. హైద‌రాబాద్ రామానాయుడు స్టూడియోలో సినిమా నవంబ‌ర్ 10న పలువురు సినీ ప్ర‌ముఖు ల స‌మ‌క్షంలో గ్రాండ్ లాంచ్‌కానుంది. రీసెంట్‌గా `ఇస్మార్ట్ శంక‌ర్‌` వంటి సూప‌ర్‌హిట్ చిత్రంలో న‌టించిన నిధి అగ‌ర్వాల్‌ను హీరోయిన్‌గా చిత్ర యూనిట్ ఖ‌రారు చేసింది.

అమ‌ర్‌రాజా మీడియా అండ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై శ్రీరామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వంలో ప‌ద్మావ‌తి గ‌ల్లా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డైరెక్ట‌ర్ శ్రీరామ్ ఆదిత్య డిఫ‌రెంట్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నారు. న‌రేశ్‌, స‌త్య‌, అర్చ‌నా సౌంద‌ర్య ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు.  న‌రేశ్‌, స‌త్య‌, అర్చ‌నా సౌంద‌ర్య త‌దిత‌రులు నటిస్తున్న ఈ చిత్రానికి రిచ‌ర్డ్ ప్ర‌సాద్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top