బాలీవుడ్‌కు కత్రినా కైఫ్ సోదరి దూరం | Isabelle Kaif drops Bollywood plans | Sakshi
Sakshi News home page

బాలీవుడ్‌కు కత్రినా కైఫ్ సోదరి దూరం

May 12 2014 10:53 PM | Updated on Apr 3 2019 6:23 PM

బాలీవుడ్‌కు కత్రినా కైఫ్ సోదరి దూరం - Sakshi

బాలీవుడ్‌కు కత్రినా కైఫ్ సోదరి దూరం

తొలుత బాలీవుడ్‌లోకి రంగప్రవేశం చేయాలని భావించిన నటి కత్రినా కైఫ్ సోదరి ఇసబెల్ ఆ ఆలోచనను విరమించుకుంది. కత్రిన బాలీవుడ్ కాకుండా మరిదేనిపైనా ఆసక్తి చూపనివిధంగానే

తొలుత బాలీవుడ్‌లోకి రంగప్రవేశం చేయాలని భావించిన నటి కత్రినా కైఫ్ సోదరి ఇసబెల్ ఆ ఆలోచనను విరమించుకుంది. కత్రిన బాలీవుడ్ కాకుండా మరిదేనిపైనా ఆసక్తి చూపనివిధంగానే ఇసబెల్ కూడా ఇక్కడికి రావాలని తొలుత భావించినా తన నిర్ణయాన్ని మార్చుకుందని ఆ కుటుంబానికి అత్యంత సన్నిహితుడొకరు తెలియజేశారు. దాదాపు ఒకేరకంగా ఉండే తాము ఇదే రంగంలో కొనసాగలేమని కత్రినా భావించిందని తెలిపారు. ఇషాబెల్లే తన మాదిరిగానే ఉండకూడదని కత్రినా భావిస్తున్నట్టు చెప్పారు. అందువల్ల ఇసబెల్ బాలీవుడ్‌కు బదులు అంతర్జాతీయంగానే తన కెరీర్‌లో ముందుకు సాగిపోవాలని వారి కుటుంబం భావిస్తోందన్నారు.
 
 డాక్టర్ క్యాబీ సినిమా కెనడా ప్రాజెక్టు. ఆ సినిమాను స్టార్టర్‌గా ఇసబెల్ భావిస్తోంది. టైటిల్ రోల్‌ను వినయ్ వీరమణి పోషిస్తున్నప్పటికీ ఇసబెల్ అతని సరసన నటించడం లేదు. సినిమా స్క్రిప్టు నచ్చడంతో ఆమె అందులో భాగస్వామిగా మాత్రమే ఉంది. విదేశీ సినిమాల్లో దూసుకుపోతున్న కునాల్ అయ్యర్‌కూడా ఈ చిత్రంలో కనిపించనున్నాడు. కొత్త నటులను పరిచయం చేసే సమయంలో ఆడిషన్ తీసుకున్న మాదిరిగానే  ఈ సినిమా కోసం ఇసబెల్ ఇసబెల్ ఆడిషన్ కూడా తీసుకున్నారు. ఇక ఇసబెల్‌పై ఆమె సహనటుడు వినయ్ వీరమణి ప్రశంసల జల్లు కురిపించాడు. ఆమె సినిమాలకు అతికినట్టు సరిపోతుందన్నాడు. కత్రినాలోని లక్షణాలన్నీ ఇసబెల్‌లోనూ ఉన్నాయన్నాడు. ఇంకొక ముఖ్యమైన విషయమేమిటంటే నటిగా ఒక్కసారిగా ఎదిగిపోవాలనే తొందరపాటుతనం ఆమెలో కనిపించడం లేదన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement