
ప్రపంచ వ్యాప్తంగా ఐఫోన్‌కు ఉన్న క్రేజ్ తెలిసిందే కదా.. తాజాగా విడుదలైన ఐఫోన్ 17 సిరీస్ ఫోన్‌లను కొనేందుకైతే యాపిల్ స్టోర్ల ముందు కస్టమర్లు క్యూకట్టారు. కొత్త ఫీచర్లతో లాంచ్ అయిన బ్రాండ్ న్యూ ఐఫోన్‌ను కొనుక్కొని తమ చేతుల్లోకి ఎప్పుడెప్పుడు తీసుకుందామా అని గంటల కొద్దీ కస్టమర్లు క్యూలో వేచిఉన్న దృశ్యాలు ప్రపంచవ్యాప్తంగా కనిపించాయి.
అయితే ఓ కస్టమర్ తన కొత్త ఐఫోన్ 17ను యాపిల్ సీఈవో టిమ్ కుక్ ముందే పడేసుకున్న సంఘటన ఓ యాపిల్ స్టోర్‌లో జరిగింది. ముచ్చటపడి కొనుక్కున్న కొత్త ఫోన్‌పై సీఈవో టిమ్ కుక్‌తో ఆటోగ్రాఫ్ చేయించుకోవాలనుకున్న యువకుడు ఆ ఆత్రుతలో ఇంకా ఓపెన్ చేసిన సరికొత్త ఐఫోన్‌ను చేజార్చుకున్నాడు.
తన ముందు కస్టమర్ కొత్త ఫోన్ పడేసుకున్నప్పుడు టిమ్ కుక్ స్పందించిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. కింద పడిన ఫోన్‌ను తీసుకునేందుకు కస్టమర్ కిందికి ఒంగగా టిమ్ కుక్ కూడా అతనికి సాయం చేసుందుకు అన్నట్టుగా కిందికి ఒంగారు. అతను ఫోన్ చేతిలోకి తీసుకున్నాక ఏం కాలేదులే అని అభినందించి ఆ తర్వాత ఆ ఫోన్‌పై తన ఆటోగ్రాఫ్ చేశారు.
ఈ సంఘటన ఎక్కడి యాపిల్ స్టోర్ జరిగిందో తెలియదు కానీ, దీనికి సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ తిరుగుతూ వైరల్‌గా మారింది. ‘ఎక్స్’లో పోస్ట్ చేసిన ఈ వీడియోకు యూజర్ల నుంచి విపరీతమైన కామెంట్లు వచ్చాయి.
this is so embarrassing 😭 pic.twitter.com/AkrKd41Kn3
— Holly - I like tech (@AnxiousHolly) September 20, 2025